న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సంఘం వారు ఇండియా 75 వ స్వాతంత్ర సంబరాలు ఘనంగా నిర్వహించారు. FIA ఆధ్వర్యంలో అన్ని భారత సంఘాలు పాలుపంచుకున్న ఈ పరేడ్ లో తానా వారి సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. చిన్నారులు ప్రదర్శించిన లంబాడి నృత్యాలు, దేశభక్తి గీతాలు, కూచిపూడి నృత్యాలు, అల్లూరి సీతారామ రాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, ఝాన్సీ లక్ష్మీబాయి వెషాలు న్యుయార్క్ నగరంలొ సందర్శకులనందరని ఆకట్టుకొన్నాయి.
ప్రతి సంవత్సరం న్యూయార్క్ నగరంలో లక్షలాదిమంది భారతీయులందరు పాల్గొనే ఈ సంబరాలు లో మన ప్రముఖ తెలుగు నటుడు అల్లు అర్జున్ ముఖ్య అతిధి గా పాల్గొనడం, ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని మరియు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథిలుగా పాల్గొనడం తెలుగు వారికి గర్వకారణం అని అందరూ కొనియాడారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగు వాడిగ దేశం మొత్తం జరుపుకునే ఈ పండుగలొ పాల్గొనడం చాలా ఆనందంగా వుంది అని చెప్పారు.
తానా పరేడ్ ఫ్లోట్ ని తెలుగు స్వతంత్ర సమరయోధులు చిత్రాలతొ, భారత జాతీయ జెండాలు, తానా జెండాలు మరియు మువన్నెల బెలూన్లతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ చౌదరి మాట్లాడుతూ తానా ఎప్పుడు మాత్రు దేశానికి సేవ చేయడానికి ముందు ఉంటుందని చెప్పారు. తానా సెవల సమన్వయకర్త రాజా కసుకుర్తి మరియు బోర్డ్ కొశాధికారి లక్ష్మి దెవినెని మాట్లాడుతూ అమెరికా లొ వున్నా మేము అందరం తానా ద్వారా కర్మ భూమి తో పాటు మాత్రు భూమి కి సెవచెయటానికి ముందు ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షులు జయ్ తాల్లూరి, జాని నిమ్మలపుడి , శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ ముసునూరు, శిరీష, శ్రీ కొనంకి, సుధీర్ నారెపలెపు, శివని, శ్రీలక్ష్మి అద్దంకి, ద్రువ చౌదరి తదితరులు పాల్గొన్నారు.