ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఎమ్మల్యే రఘురాకృష్ణరాజును ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు సభలో స్పీకర్ గా వ్యవహించారు రఘురామ. అయితే, అనూహ్యంగా టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనకు మాట్లాడేందుకు తగినంత సమయం కేటాయించడం లేదంటూ రఘురామపై అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది.
నూతన ఉచిత ఇసుక పాలసీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, పాత విధానం బాగుందని నెహ్రూ అన్నారు. ఇక, పంచాయతీలలో గ్రామ, వార్డు సచివాలయాలను కలిపేయాలని..రెండు వ్యవస్థలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, కొత్త ఇసుక పాలసీ బాగోలేదని సభలో నెహ్రూ చెప్పడంపై టీడీపీ సభ్యులు కాస్త అసహనం వ్యక్తం చేశారు. దానిని గమనించిన రఘురామ…త్వరగా ముగించాలని నెహ్రూను కోరారు. దీంతో, నెహ్రూ అసహనానికి గురై అలకబూనారు.
‘‘ కూర్చోమంటే కూర్చుంటాను…నాకు ఇబ్బందేమీ లేదు..3 నిమిషాలు కాకుండానే పదే పదే అడ్డొచ్చేస్తే ఎలా…నన్ను ప్రతిపక్షంగా చూడకండి…అద్యక్షా మీతో వాదన నాకొద్దు…సారీ.. టైం నాకూ ఇవ్వాల్సిన బాధ్యత సభపై ఉంది…మీరు ఇస్తానంటే ఓకే…లేదంటే లేదు…అలా చేస్తుంటే..నన్ను ప్రతిక్షంగా చూస్తున్న ఫీలింగ్ వస్తోంది…సభకు రావద్దంటే రాను మానేస్తాను..నాకు అభ్యంతరం లేదు…అది కరెక్టు కాదండీ.’’ అంటూ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.