సినిమావాళ్లకు సంబంధించిన విషయాలన్ని బయటకు రావు. వారంతా బయట ప్రపంచానికి అసలుసిసలు తారలు అన్నట్లుగా ఉంటారు. అందులోనూ సెలబ్రిటీ స్టేటస్ ఒకసారి తగులుకున్నాక.. వారి తీరు పూర్తిగా మారిపోతుందంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించిన ఒక స్టార్ హీరోయిన్ ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా తాజాగా తన బయోగ్రఫీలో సోనమ్ కపూర్ గురించి రాసుకొచ్చారు.
అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథతో తెరకెక్కిన భాగ్ మిల్కా బాగ్ చిత్రానికి ఓపక్క అవార్డులే కాదు.. ప్రేక్షకుల రికార్డుల్ని సొంతం చేసుకుందీ చిత్రం. ఇందులో కీలక పాత్ర పోషించిన ఫరాన్ అక్తర్ .. అతిధి పాత్రను వేసిన సోనమ్ కపూర్ లకు మంచి గుర్తింపు లభించాయి. ఈ సినిమా మీద సోనమ్ కు ప్రత్యేక ఆసక్తి ఉండేదన్నారు.
లవ్ స్టోరీ కాకున్నా.. సోనమ్ ఈ స్టోరీని ఓకే చేయటానికి.. చిన్న పాత్రే అయినా.. ప్రేక్షకుల మదిలో నిలిచి పోయేలా ఆమె పాత్ర ఉందని చెప్పాలి. నిజానికి ఈ మూవీలో సోనమ్ ది అతిధి పాత్ర. అయినప్పటికీ ఆమె ఓకే చెప్పటానికి కారణం.. ఆమె పోషించిన పాత్రేనని చెప్పాలి. ఈ సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసిన తర్వాత.. ఆమెకు పారితోషికం ఇచ్చే ప్రయత్నంచేశారు నిర్మాత.
అయితే.. అందుకు ససేమిరా అన్న సోనమ్ కేవలం రూ.11 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కథలో ఎలాగైనా భాగస్వామ్యం కావాలన్న కోరికే.. ఆమె చేత నటించేలా చేసిందని పేర్కొన్నారు. మిగిలిన వారికి భిన్నంగా ఆమె కేవలం రూ.11 మాత్రమే తీసుకొన్న వైనం డైరెక్టర్ పుణ్యమా అని బయటకు వచ్చిందని చెప్పాలి. స్టార్ హీరోయిన్ అయి ఉండి.. ఇలా వ్యవహరించటం అందరు హీరోయిన్లకు సాధ్యం కాదనే చెప్పాలి.