• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Amararavti: రాజధాని రహస్యం!?

రాజధాని పేరడిగితే అమరావతి ఊసెత్తని వైనం : కేంద్రం తీరు అనుమానాస్పదం

admin by admin
August 11, 2021
in Andhra, India, Politics, Top Stories, Trending
0
0
SHARES
681
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమరావతిని ఆంధ్ర రాజధానిగా కేంద్రం గుర్తించడం లేదా..?

సీఎం జగన్మోహన్‌రెడ్డి బాటలోనే మోదీ ప్రభుత్వం కూడా నడుస్తోందా..?

ఇటీవల రాష్ట్ర అధికారులకు దాని నుంచి వస్తున్న లేఖలు, సర్క్యులర్లపై ఆంధ్రప్రదేశ్‌-హైదరాబాద్‌ అని ఉంటుండడం ఈ అనుమానాలకు ఆస్కారమిస్తోంది.

ఏదో పాత అలవాటు ప్రకారం అలా పెట్టారని కాసేపు అనుకున్నా.. జగన్‌కు ముందు చంద్రబాబు ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు కదా! రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలడం.. దానికి ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది కేంద్ర మంత్రులు, అధికారులు వచ్చి వెళ్లారు.

ఉత్తర ప్రత్యుత్తరాలూ సాగాయి. వాటిపై అమరావతి అని స్పష్టంగా పేర్కొన్నారు కదా! ఇప్పుడు హైదరాబాద్‌ ఎందుకు గుర్తుకొచ్చింది. అదీగాక జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. బిల్లులను ఆమోదించుకున్నారు. గవర్నర్‌ కూడా సంతకం చేశారు. అయితే వాటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. విశాఖకు కార్యాలయాల తరలింపునకు బ్రేక్‌ వేసింది.

రాజధానులపై వ్యాజ్యాలు తేలేదాకా అక్కడకు తరలివెళ్లే అవకాశమే ఉండదు. ఈ విషయం కేంద్రానికి తెలియదా? ఈ వ్యాజ్యాల్లో అది కూడా ప్రతివాదిగా ఉంది కదా! ఒక్క రాజధానికే దిక్కులేదు.. మూడు రాజధానులు కడతారా అని బీజేపీ జాతీయ నేతలు కూడా జగన్‌ను ఎద్దేవాచేశారు. కానీ ఇప్పుడు ఆ మూడు రాజధానులకు కేంద్రం అంగీకరించినట్లు కేంద్ర హోంశాఖ చెప్పిన విషయాలు ధ్రువపరుస్తున్నాయి.

‘ఏపీ రాజధాని ఏది? రాష్ట్రంలో పేదల కోసం ఎన్ని ఇళ్లు కట్టారు? రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్ని నిధులు మంజూరుచేశారు? రాష్ట్రంలో స్మార్ట్‌ సిటీలకు ఎన్ని నిధులిచ్చారు? రాష్ట్రప్రభుత్వం పేర్కొన్న మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా’ అని హైదరాబాద్‌కు చెందిన చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నలు వేశారు.

రాజధానిపై ప్రశ్న గతంలో అడిగినప్పుడు.. ‘మీరు అడిగిన విషయం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2(ఎఫ్‌)లో పేర్కొన్న నిర్వచనం కిందికి రాదు’ అని కేంద్రం జవాబు చెప్పింది. అంటే… ఏపీ రాజధానికి సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి సమాచారమూ లేదట! దీనిపై కోర్టుకెళ్తానని ఆయన స్పష్టం చేయడంతో కేంద్రం సమాధానాలిచ్చింది.

ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ-అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి.. మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని.. రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది ఆ రాష్ట్రప్రభుత్వమే నిర్ణయిస్తుందని పేర్కొంది. ఇక్కడే కేంద్రం వైఖరిపై సందేహాలు వస్తున్నాయి. ఏపీ రాజధాని ఏదంటే.. ఇప్పుడు ఏది ఉంటే అదే చెప్పాలి.

మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు తెచ్చినట్లు..? పోనీ మూడు రాజధానులను అంగీకరిస్తున్నట్లయినా చెప్పలేదు. అసలా సమాధానాల్లో అమరావతి అన్న పదమే లేదు. మూడు రాజధానుల్లో ఆ పేరూ ఉంది కదా! అంటే రాజధానిగా దానిని అంగీకరించనట్లే కదా! కేంద్రం వైఖరేమిటో అంతుపట్టకుండా ఉంది.

అమరావతి నిర్మాణానికి రూపాయైునా ఇవ్వలేదు!

అమరావతి నిర్మాణానికి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందని.. నాటి సీఎం చంద్రబాబు దీనికి లెక్కలు చెప్పాలని బీజేపీ నేతలు నిన్నటిదాకా తెగ మాట్లాడారు. ఇదంతా అబద్ధమని.. కేంద్రం అమరావతి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తేలింది. ‘అమరావతి నిర్మాణానికి కేంద్రం ఎంత సహాయం చేసింది?’ అని చైతన్యకుమార్‌రెడ్డి ప్రధాని కార్యాలయాన్ని ఆర్టీఐ చట్టం కింద ప్రశ్నించారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది.

‘‘ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్రాంతంలో రెండు ప్రాజెక్టుల కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెయ్యి కోట్లు ఇచ్చింది. వీటిని.. విజయవాడ నగరంలో వరదనీటి నిర్వహణ, గుంటూరు నగరంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి కోసం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం ఇంతకు మించి ఎలాంటి నిధులూ ఇవ్వలేదు. నిధుల ప్రతిపాదనలూ మా శాఖ వద్ద పెండింగ్‌లో లేవు’ అని తెలిపింది.

Tags: AmaravatiandhrapradeshAndhrapradesh capitalAP CapitalBJPChandrababuJaganModiycpYSRCP
Previous Post

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

Next Post

 స్టార్ హీరోయిన్ ఆ సినిమాకు 11 రూపాయలే తీసుకుందట

Related Posts

Top Stories

జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్

January 31, 2023
Trending

నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి

January 31, 2023
Trending

బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?

January 31, 2023
Trending

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

January 31, 2023
Top Stories

కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే

January 31, 2023
Trending

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

January 31, 2023
Load More
Next Post

 స్టార్ హీరోయిన్ ఆ సినిమాకు 11 రూపాయలే తీసుకుందట

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !
  • కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే
  • ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!
  • జగన్ ఢిల్లీ టూర్… అనేక వెర్షన్లు !
  • జగన్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్..లోకేశ్ పై సెటైర్ కి రిటార్ట్
  • ప్ర‌జ‌ల జ‌గ‌న్ కాదు.. `ప‌ర‌దాల` జ‌గ‌న్!
  • ఇదేంది జగనన్నా .. ఇలా జ‌రిగింది?
  • అదానీని ఇంకోసారి ఏకిపడేసిన హిండెన్‌బ‌ర్గ్
  • య‌ల‌మంచిలిలో `అన్నా క్యాంటీన్‌` ఏర్పాటుకు ఎన్నారై టీడీపీ విత‌ర‌ణ‌
  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra