-
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్పై పేచీ
-
5,615 కోట్లు రాష్ట్రమే భరించాలని గెయిల్, హెచ్‌పీసీఎల్ పట్టు
-
కట్టేదే లేదని రాష్ట్రప్రభుత్వం బెట్టు
-
అడకత్తెరలో 32,901 కోట్ల ప్రాజెక్టు
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్రం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్), హిందూస్థాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లకు గతంలోనే ఆదేశాలిచ్చింది. టీడీపీ హయాంలో 2017 జనవరిలో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కేంద్రం-గెయిల్, హెచ్‌పీసీఎల్-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.దానిప్రకారం కాకినాడ సెజ్‌లో రెండు వేల ఎకరాల్లో రూ.32,901 కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం.. దీనికి అవసరమైన పెట్టుబడి, వచ్చే రాబడి.. పెట్టుబడిపై చెల్లించాల్సిన వడ్డీ తదితరాలపై గెయిల్, హెచ్‌పీసీఎల్ అంచనాలు రూపొందించాయి. ఆ సందర్భంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంశం తలెత్తింది.
కాంప్లెక్స్ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిపై కొంత ఆదాయం రావాలి. ఆదాయం వస్తేనే పెట్టిన పెట్టుబడిపై వడ్డీ, ఇతర ఖర్చులు కలిసొవస్తాయి. అయితే రావలసిన రాబడికి.. వస్తుందని అంచ నా వేసిన ఆదాయానికి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటున్నారు.
ఇది రూ.5,615 కోట్లుగా అంచనా వేశారు. ఈ వ్యత్యాసాన్ని ఏటా రూ.975 కోట్లు చొప్పున 15 ఏళ్లపాటు తమకు రాష్ట్రప్రభుత్వమే చెల్లించాలని.. అందుకు అంగీకరిస్తేనే ప్రాజెక్టుపై ముందుకెళ్తామని గెయిల్, హెచ్‌పీసీఎల్ తేల్చిచెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది విభజన చట్టం 13వ షెడ్యూల్లో పెట్టిన హామీ అని.. కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుని ఏర్పాటు చేయాలని అంటోంది.
వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కట్టే బాధ్యత తనకు లేదని.. కేంద్రం ఈ ప్రాజెక్టుపై వేసే కార్పొరేట్ పన్ను తగ్గించుకుని, పెట్టుబడిపై వడ్డీ రేటును తగ్గించుకుంటే సరిపోతుందని వాదిస్తోంది.
మా వల్ల కాదు..
అసలే రెవెన్యూ లోటులో ఉన్న తాము.. వీజీఎఫ్ నిధులు ఇవ్వలేమని ము ఇవ్వలేమని, ఈ మొత్తాన్ని కేంద్రమే భరించాలని నాటి సీఎం చంద్రబాబు అనేకసార్లు కోరారు. కేంద్రం నోరుమెదపలేదు. దీంతో 2017 నుంచి ప్రాజెక్టు ముందుకు కదల్లేదు.
జగన్ ప్రభుత్వం వచ్చాక ఏడాది పాటు ఈ ప్రాజెక్టుపై కనీసం సంప్రదింపులైనా జరపలేదు. గతేడాది మాత్రం కేంద్ర, రాష్ట్ర అధికారులు పలు దఫాలుగా చర్చలు జరిపారు. అవీ ఫలించలేదు. కేంద్రమే వీజీఎఫ్ కింద నిధులు సమకూర్చాలని.. ఏడాదికి రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్లపాటు తాము చెల్లించలేమని రాష్ట్రప్రభుత్వం గత నెల జూన్ 21న కేంద్రాన్ని కోరింది.
సీఎం జగన్ అప్పట్లో ఢిల్లీ వెళ్లినప్పుడు.. నాటి పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ పన్నును కేంద్రం 25 శాతం తగ్గించిందని, ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు తగ్గిన నేపథ్యంలో వీజీఎఫ్‌తో నిమిత్తం లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.
దీంతో కేంద్ర పెట్రోలియం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం ఏర్పాటుచేసి విధివిధానాలు ఖరారు చేస్తామని ప్రధాన్ ఆ సందర్భంగా చెప్పినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం పిడుగులాంటి వార్తను ప్రకటించింది.
వీజీఎఫ్‌పై రాష్ట్రప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని.. దానికున్న ఆసక్తిపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ రాజ్యసభలో తేల్చిచెప్పారు. జగన్ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోవడం వల్లే ప్రాజెక్టు పోయే పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ స్వయంగా కేంద్ర పెద్దలను కలిసి పరిస్థితి వివరించినా వారు పట్టించుకోలేదని తేలిపోయింది. దీంతో ఇప్పుడు ప్రాజెక్టు రావడం కలేనని పారిశ్రామిక రంగ నిపుణులు చెబుతున్నారు.