మొదటి సగం పర్లేదు. రెండో సగం పండలేదు. బాబు ‘బాహు’న్నాడు. హీరోవిన్ వర్సెష్టుగా ఉంది. హీరోవిన్ రోల్ ఇంకా వర్సెష్టుగా ఉంది. బాబు కాస్ట్యూమ్స్ బాగున్నాయి. బాబు యాజ్ ఇటీజ్గా ఇంకా బాగున్నాడు. సినిమా బడ్జెట్ అంతా బాబు వేసుకున్న ఆ ఇటాలియన్, ఫ్రెంఛ్ డిజైనర్ హుడీలకి, టీషర్టులకే ఖర్చయింది.
కథలో అమెరికాలో వడ్డీయాపారం అనే మాసిక అతకలేదు. ఎయిర్పోర్టులో పరిచయం అయిన నదియా కోసం బాబు అంత సాహసం చేయడం అనే ప్లాట్ ఉడకలేదు. తనకి బాకీ ఉన్న వడ్డీ ఠంచనుగా కట్టకపోతే వెంటబడి కొట్టేసే బాబు, అప్పులు వసూలు చేసే రికవరీ ఏజెంట్లని కొట్టడం తప్పు కదండీ ?
బాబు కామెడీ టైమింగ్ కొంచెం తేడాగా ఉంది. వెన్నెల కిషోరుది బలాత్కారపు కామెడీ. సంగీతం, బీజీయెం, ఆరార్ లాంటివి ఏటీ పెద్దగా లేవు. బాబుకి ఎలాగూ డ్యాన్స్ రాదు కనుక పెద్దగా చెప్పేదేం లేదు. చూడాల్సినంత ఏటీ లేదు సిన్మాలో. ఒక్క బాబు తప్ప.
PS: “నేను విన్నాను.. నేను ఉన్నాను” అని బాబు చెప్పిన డవిలాగు వినగానే రెండుచేతులూ లాగూ జేబులో పెట్టుకుని వెళ్ళి పోదామనుకున్నారు, కానీ బాబు ఫీలవుతాడని ఆగి పోతున్నారు—
పూర్తి రివ్యూ త్వరలో —