న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `సరిపోదా శనివారం`. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా.. ఆగస్టు 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. టాక్ అనుకూలంగా ఉండటం, సోలో రిలీజ్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద నాని మాస్ రచ్చ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో సరిపోదా శనివారం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
తాజాగా 3 డేస్ కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది. మూడో వీకెండ్ కావడంతో నాని మూవీ మంచి జోరు చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.88 కోట్లు, రెండో రోజు రూ. 3.04 కోట్ల షేర్ రాబట్టిన సరిపోదా శనివారం.. మూడో రోజు రూ. 4.63 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల టోటల్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే.. ఏపీ మరియు తెలంగాణలో రూ. 13.60 కోట్ల షేర్, రూ. 21.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక నైజాం ఏరియాలోనే రూ. 6.74 కోట్లు వసూల్ చేసింది.
అలాగే వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో సరిపోదా శనివారం చిత్రం రూ. 24.70 కోట్ల షేర్, రూ. 45.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో రూ. 7.55 కోట్లు వచ్చాయి. కాగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్ల వరకు ఉండగా.. మూడు రోజుల్లో దాదాపు అరవై శాతం రికవరీ అయిపోయింది. ఇంకా
రూ. 17.30 కోట్ల షేర్ కలెక్షన్స్ వస్తే బాక్సాఫీస్ వద్ద సరిపోదా శనివారం సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది.