రాజకీయాలు అన్నాక పొగడ్తలు పావలా అయితే.. విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలు.. వ్యక్తిత్వాన్ని హననానికి పాల్పడే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యన ఇది మరింత ఎక్కువైంది. తాముఅభిమానించే నేతను మునగ చెట్టు ఎక్కించేస్తూ.. ప్రత్యర్థిని దారుణంగా తొక్కేసే తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి రచ్చే ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇటీవల సంచలనంగా మారిన యూట్యూబ్ సారంగదరియా పాటను వైసీపీ.. జనసేన అభిమానులు ఒకరికొకరు పోటాపోటీగా పేరడీల్ని తయారు చేయటం.. తమ ప్రత్యర్థిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పాటను తొలుత వైసీపీ అభిమానులు.. ‘ఆడి పేరు గాజు గ్లాసు’ అంటూ పేరడీ రాస్తే.. దానికి పవన్ అభిమానులు ఏ మాత్రం తగ్గని రీతిలో ‘ఆడి పేరు జైల్ రెడ్డి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్టు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ తిరుగుతోంది. ఎవరి అభిమానులు వారు..పేరడీలపై రచ్చ చేస్తుంటే.. రెండు పక్షాలకు సంబంధం లేని వారు మాత్రం.. ఏమిటీ అతి అంటూ తిట్టిపోస్తున్నారు.
పవన్ మీద వైసీపీ తయారు చేసిన పేరడీ చూస్తే..
కుడి భుజంపై కమలం
ఎడం భుజంపై సైకిల్
ఆ ఎమ్మెల్యే ఫ్యాను…
ఆడి పేరే గాజు గ్లాసు
జగన్ మీద జనసేన తయారు చేసిన పేరడీ చూస్తే..
ఆడి కుడి భుజంతో బాబాయ్ మర్డర్
ఎడం భుజం మీద కోడి కత్తి డ్రామా
ఆ వెనకాలేమో 32 కేసులు..
ఆడి పేరే జైల్ రెడ్డి
చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ పేరడీ ఫైట్లు మరింత పెరగటం ఖాయమంటున్నారు. ఇలాంటి వాటితో ఆన్ లైన్ ఉద్రిక్తత మరింత పెరగటమే కాదు.. ఏపీ రాజకీయాల్లో మరింత హీటు రేపటం తప్పదన్న మాట వినిపిస్తోంది.