తల తిరుగుతోంది.లేదా కాలు వాపు వస్తోంది. లేదా అమ్మకు బీపీ చెక్ చేయించాలి, షుగర్ టెస్ట్ చేయించుకావాలి. ఇలా ఏదో ఒక ఆరోగ్య అవసరం… ఆసుపత్రికి అత్యవసరంగా వెళ్లాలి. కానీ బయట కోవిడ్..ధర్డ్ వేవ్ భయాలు. ఆసుపత్రికి వెళ్లి ధైర్యంగా లైన్లో నిలబడలేని పరిస్దితి. ఏ ఆసుపత్రికి వెళ్తే కోవిడ్ మన వెంటబడుతుందో అనే భయం. అలాగని చికిత్స తీసుకోకుండా ఎలా ఇంట్లో ఉండగలం.. అలాంటప్పుడు రైట్ కేర్ ని సంప్రదిస్తే రైట్ నిర్ణయం తీసుకున్నట్లే.
అవును …
ఈ “రైట్ కేర్” ఏమిటి..
మీకు గుర్తుందో లేదో… ఇంతకు ముందు రోజుల్లో దాదాపుగా ప్రతి కుటుంబానికి, లేదా కొన్ని కుటుంబాలకు కలిపి ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. అంటే.. ఫ్యామిలీలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే.. కబురు పెడితే వెంటనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూసేవారు. మీకు పాత సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి సీన్లు కనిపించేవి. అయితే ఇప్పుడీ ఫ్యామిలీ డాక్టర్ విధానం కనుమరుగైంది. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పరుగులుపెట్టాలసిన పరిస్దితి. అక్కడ రకరకాల టెస్ట్లు, మనకేం అనారోగ్యం చేసిందో తెలుసుకోవటానికి ఓ జీవితకాలం టైమ్ పడుతోంది. ఈ లోగా టెస్ట్ లు, మందులు పేరుతో మనం పీల్చి పిప్పి అయిపోతున్నాము. అదే మన గురించి తెలిసిన డాక్టర్, మన ఇంటికే వచ్చి వైద్యం చేసే డాక్టర్ ఉంటే… ఇంత సమస్య ఉండదు కదా.. అదో ధైర్యం కదా…
ఆ ధైర్యాన్ని, భరోసాని ఇవ్వటానికి “రైట్ కేర్” వారు ముందుకు వచ్చారు.
కొంచెం అటూ ఇటూ గా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టుని మళ్లీ మన జీవితాల్లోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులకి ఈ “రైట్ కేర్” ఓ వరంగా మారుతోంది. ఆసక్తికరం గా ఉంది కదా. వాళ్లు అందించే సర్వీసులు ఏమిటో చూద్దాం.
“రైట్ కేర్” కాన్సెప్టు ఒకటే.. రోగికి, మెరుగైన వైద్య వ్యవస్థ కి మధ్య అనుసంధానించటమే.
- ప్రస్తుతం మన జీవిన విధానం చాలా వేగం గా మారిపోయింది.
- బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలకు,పనులకు,చదువులకు ఇంట్లో వాళ్లంతా వెళ్లిపోతున్నాం. అలాంటప్పుడు ఇంట్లో అనారోగ్యం ఉన్న మనిషి ఉంటే వాళ్లను చూసుకునేదెవరు.
- ఒకప్పుడు అంటే మన ఇళ్లలో పెద్దవాళ్లు ఉండేవాళ్లు..ధైర్యంగా ఉండేది.
- కానీ ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నవాళ్లను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవాల్సిన సిట్యువేషన్. వాళ్లకు ఏ అవసరం ఉన్నా మనం తిరిగి వచ్చేదాకా తీర్చే దిక్కు ఉండదు.మనం బయిటకు వెళ్లినా ప్రశాంతంగా ఉండలేము.
- మన ఆలోచనలు అన్నీ వీరి చుట్టూనే తిరుగుతాయి.
అలాంటి టైమ్ లోనే “రైట్ కేర్” సేవలు మనకు అద్భుతం గా ఉపయోగపడతాయి.
“రైట్ కేర్” లో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో తేవటంతో ఏ అనారోగ్య అవసరం ఉన్నా ఆప్తుడులా అక్కున చేర్చుకుని ఆదుకునే అవకాశం ఉంటోంది.
వయస్సు మళ్లినవారికి ఉండే దీర్ఘ వ్యాధులు అయిన బీపి,షుగర్, పక్షవాతం సమస్యలకు తమ సేవలతో రైట్ కేర్ చక్కని పరిష్కారం చూపుతుంది.
అదే ఏదైనా ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలనుకునేవారికి, యాక్సిడెంట్స్ అయి ఇంటికి వచ్చిన వారికి అయితే “రైట్ కేర్” ఓ వరం.
అలాంటి వారికి శిక్షణ పొందిన వైద్యులతో కూడిన టీమ్ “రైట్ కేర్” లో ఉండటం కలిసి వచ్చే విషయం. ఇంజక్షన్స్, డ్రెస్సింగ్ చేయాలనేది చాలా సులభంగా జరిగిపోతాయి.
పెద్ద పెద్ద డాక్టర్లు, శిక్షణ పొందిన నర్సులు, ఫిజియోథెరిపిస్ట్ లు ఇరవై నాలుగు గంటలూ “రైట్ కేర్” ద్వారా అందుబాటులో ఉంటారు.
ఇంక హెల్త్ చెకప్ కావాలి అంటే అసలు శ్రమపడక్కర్లేదు. ఒక్క ఫోన్ కాల్ తో ఇంతా ఇంటివద్దే జరిగిపోతుంది.
మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కోసం ప్రత్యేకమైన సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఇక “రైట్ కేర్” సేవలు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి లలో ఇప్పటికే ప్రారంభమై విజయవంతంగా నడుస్తున్నాయి.అతి త్వరలో గుంటూరు మరియు రాజమండ్రి నగరాలలో “రైట్ కేర్” వారి సేవలను ప్రారంభించబోతున్నారు.
అలాగే త్వరలో “రైట్ కేర్” వారు ఓ “యాప్ (App Store/Android)” తో తమ సేవలను విస్తరించేందుకు, మరింతగా మనకు అందుబాటులోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంబులెన్స్ సేవలు కూడా ఇప్పటికే ఉన్నాయి.
అనారోగ్యం ఏదైనా “రైట్ కేర్” తో పరార్ అన్న లక్ష్యంతో ఓ విభిన్న ఆలోచనా ధృక్పధంతో ముందుకు వస్తున్నారు. వారిని ఆహ్వానిద్దాం.. అవసరం అయినపుడు వారి సేవలు వినియోగిద్దాం.. ఓ “కొత్త జీవన శైలికి” ఆహ్వానం పలుకుదాం.
www.ritecare.in Tel. 9115 789 789 (India)