వయసులో పెద్దవారు, దేశంలో అత్యధిక ఆలయాలు కట్టించి, నిర్వహించిన కుటుంబానికి వారసులు, కేంద్ర మంత్రిగా అత్యత్తుమ ప్రతిభ కనబరిచిన అశోకగజపతిరాజును ‘వెధవ’ అని సంబోధించిన వెల్లంపల్లిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
మంత్రిని జనం బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు. చరిత్ర తెలియకుండా 12 వేల ఎకరాలు సింహాచలానికి దానం చేసిన కుటుంబాన్ని, 13 వేల ఎకరాల విద్యాసంస్థలకు దానం ఇచ్చిన కుటుంబ వారసుడిని ఇంత నీచంగా మాట్లాడతావా? అసలు నువ్వు మంత్రి అనుకున్నావా అంటూ జనం విమర్శిస్తున్నారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన రఘురామరాజు దేవాదాయ శాఖమంత్రి వెంటనే రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. ఇన్ని జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా? 18 నెలలుగా కళ్లు మూసుకున్నారా? చర్చి మీద రాళ్లేస్తే 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు, ఇన్నిదేవాలయాల మీద దాడులు చేస్తే ఒక్కరినీ అరెస్టు చేయకపోవడంపై రఘురామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రిపదవి కాపాడుకోవడం కోసం వైసీపీ సొంత భాష అయిన బూతు భాషతో విమర్శలు చేయడం మినహా ఏమీ చేతగాని వెధవల్లారా అంటూ రఘురామరాజు విరుచుకుపడ్డారు. తనదైన వెటకారంతో పాటు ఆలయ దాడులపై తీవ్ర స్వరంతో ప్రభుత్వానికి, దేవాదాయ శాఖమంత్రికి వార్నింగ్ ఇచ్చారు రఘురామరాజు.