సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తన కూతుళ్ల మీద ఎంత ప్రేమో తెలిసిందే.
ఆ ప్రేమను సినిమాల రూపంలోనూ ఆయన చూపిస్తున్నారు.
కూతుళ్లిద్దరినీ సినీ రంగం వైపు అడుగులు వేయించిన ఆయన.. వాళ్లిద్దరూ దర్శకులుగా మారడంలో కీలకంగా వ్యవహరించారు.
తాను మంచి ఫాంలో ఉన్న సమయంలో దర్శకత్వ అనుభవమే లేని చిన్న కూతురు సౌందర్యతో కొచ్చడయాన్ అనే భారీ యానిమేషన్ మూవీ చేసి ఆమె కెరీర్‌ను పుష్ చేయడానికి ప్రయత్నించాడు.
ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు తన పెద్ద కూతురు ఐశ్వర్యతో సూపర్ స్టార్ జట్టు కడుతున్నారు. కాకపోతే ఈసారి ఆయన చేస్తున్నది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు.
ఐశ్వర్య దర్శకత్వంలో మొదలైన లాల్ సలామ్ అనే చిత్రంలో రజినీ ప్రత్యేక అతిథి పాత్ర చేయబోతున్నారు. ఆ సినిమాకు తాజాగా ప్రారంభోత్సవం జరిగింది. సదరు ఫొటోలను కూడా సౌందర్య షేర్ చేసుకుంది.
తండ్రి తన టాలెంట్‌ను నమ్మి ఈ సినిమా చేయడం పట్ల అమితానందానికి గురైంది సౌందర్య.
సౌందర్య ఇప్పటికే రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది.
భర్త ధనుష్‌తో తీసిన 3 సినిమాకు మంచి హైప్ వచ్చినా అది డిజాస్టర్ అయింది.
తర్వాత వై రాజా వై అనే థ్రిల్లర్ మూవీ తీసి హిట్ కొట్టింది.
దీంతో పాటు ఆమె ఒక డాక్యుమెంటరీ కూడా తీసింది.
ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని లాల్ సలామ్ మూవీ తీయబోతోంది. మరి చిన్న కూతురిలా కాకుండా పెద్ద కూతురైనా రజినీతో హిట్ కొడుతుందేమో చూడాలి.
ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. లైకా ప్రొడక్షన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.
ఇటీవలే తాము రజినీకాంత్‌తో రెండు సినిమాలు చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అందులో ఒకటి ఈ చిత్రం. మరొకటి ఆయన హీరోగా నటించబోయేది.
ఈ చిత్రానికి డాన్ దర్శకుడు సిబి చక్రవర్తి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.