• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం…వైరల్

admin by admin
January 29, 2022
in India, Politics, Top Stories
0
0
SHARES
518
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పెగాసస్ స్పైవేర్ వ్యవహారం కొద్ది నెలల క్రితం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మన దేశంలోని కొందరు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులపై మోడీ సర్కార్ ఈ స్పైవేర్ ను ఉపయోగించి నిఘా పెట్టిందని విపక్షాలు ఆరోపించాయి. అంతేకాదు, పార్లమెంటులో ఈ విషయంపై చర్చించాలని పట్టుబట్టాయి. కానీ, అలాంటిదేమీ లేదని మోడీ సర్కార్ తేల్చిపడేసింది. ఈ క్రమంలోనే తాజాగా మోడీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా పెగాసస్ వ్యవహారంపై న్యూయార్క్ టైమ్స్ లో సంచలన కథనం వెలువడింది. భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన ఒప్పందంలో ‘పెగాసస్’ స్పైవేర్ ఓ భాగమని ఆ కథనం సారాంశం.

ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని రాహుల్ ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచర్యం చేయడానికి మోడీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసిందని రాహుల్ ఆరోపించారు. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని, కోర్టును వారు లక్ష్యంగా చేసుకున్నరని, ఇది దేశద్రోహం అని రాహుల్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం భారత దేశానికి శత్రువుగా ఎందుకు వ్యవహరించిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. యుద్ధంలో ఉపయోగించే  ఆయుధాన్ని భారతీయులపై ఎందుకు ఉపయోగించిందని నిలదీశారు.

రాహుల్ గాంధీతోపాటు భారతీయులపై నిఘా పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం మిలిటరీ గ్రేడ్ స్పైవేర్‌ను ఉపయోగించిందనడానికి ఇదే రుజువని  కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహమ్మద్ మండిపడ్డారు. “The Battle for the World’s Most Powerful Cyber weapon” శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆ వ్యాసం దుమారం రేపుతోంది. 2017లో ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటించినపుడు ఇరు దేశాల మధ్య దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదిరాయని ఆ వ్యాసంలో పేర్కొంది. అత్యాధునిక ఆయుధాలు, ఇంటెలిజెన్స్ గేర్ అమ్మకం కోసం కుదిరిన ఆ ఒప్పందాల్లో పెగాసస్ స్పైవేర్, మిసైల్ సిస్టమ్ చాలా కీలకమైనవని పేర్కొంది. అయితే, ఆ కథనంపై, రాహుల్ గాంధీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఏది ఏమైనా…మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం…సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Tags: newyork times magazinepegagus spywarepm modirahul gandhirahul gandhi slams modishocking article
Previous Post

ట్రెజరీ ఉద్యోగులకు జగన్ షాక్…ఏం జరగనుంది?

Next Post

షాకింగ్: బాలయ్యపై పోలీస్ కంప్లయింట్

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
India

హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు

June 19, 2025
Load More
Next Post

షాకింగ్: బాలయ్యపై పోలీస్ కంప్లయింట్

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra