• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ట్రెజరీ ఉద్యోగులకు జగన్ షాక్…ఏం జరగనుంది?

admin by admin
January 29, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
జగన్
0
SHARES
525
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో పీఆర్సీ  రచ్చపై ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగులు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. కొత్త పీఆర్సీ అమలు చేస్తే సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేయగా….కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేాకాదు, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ట్రెజరీ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమేనని, అందుకే జీతాలను ప్రాసెస్ చేయబోమని ట్రెజరీ శాఖ ఉద్యోగులు పట్టుబట్టి కూర్చున్నారు. ఈ క్రమంలోనే ట్రెజరీ ఉద్యోగులకు షాకిచ్చేలా జగన్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యోగుల జీతా తక్షణమే ప్రాసెస్ చేయాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. జీతాలు ప్రాసెస్‌ చేసెయ్యాలని ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలిచ్చినా జీతాలు ప్రాసెస్ కాలేదని, అందుకే మెమోలు జారీ చేశామని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రకారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
బిల్లులు ప్రాసెస్‌ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు, సంబంధిత విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.

విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, ట్రెజరీ ఉద్యోగులు ఇరకాటంలోపడ్డారు. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేందుకే ట్రెజరీ ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు మద్దతుగా ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా ముందుకు వస్తున్న తరుణంలో రెవెన్యూ శాఖతో అనుబంధం ఉన్న తాము వెనక్కు తగ్గేదేలే అని ట్రెజరీ శాఖ ఉద్యోగులు అంటున్నారని తెలుస్తోంది.

Tags: ap cm jaganap treasury employeesemployees strike in apmemos to treasury employeesprc issue in ap
Previous Post

ఓ తరాన్ని జగన్ నాశనం చేశారు…పయ్యావుల ఫైర్

Next Post

మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం…వైరల్

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post

మోడీపై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం...వైరల్

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra