నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత నాగ వంశీ స్వయంగా కన్ఫార్మ్ చేశారు. వరుస విజయవంతమైన చిత్రాలతో స్టార్డ్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతున్న నాగవంశీ.. ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య హోస్ట్ చేస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`లో డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లతో కలిసి నాగవంశీ పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన క్రేజీ ప్రమో ఇప్పటికే బయటకు వచ్చింది. జనవరి 3న ఫుల్ ఎపిసోడ్ రాబోతోంది.
అయితే ఈ షోలో రష్మిక పెళ్లి ప్రస్థావన వచ్చింది. రష్మిక పెళ్లి సెటిల్ అయినట్లుంది? అని బాలయ్య అడగ్గా.. `తెలుగు ఇండస్ట్రీలోని హీరోను పెళ్లి చేసుకుంటుందని తెలుసు. కానీ ఎవరు ఏంటని ఇంకా బయటకు చెప్పట్లేదు సార్` అంటూ నిర్మాత నాగవంశీ బదులిచ్చారు. దాంతో వెంటనే `చెప్పమ్మా కొంచెం వెబ్‌సైట్స్‌కి ఇద్దాం` అంటూ బాలయ్య సెటైర్ పేల్చారు.
ఇక నిర్మాత నాగవంశీ ఆ తెలుగు హీరో ఎవరు అన్నది చెప్పకపోయినా.. రష్మిక పెళ్లి సెట్ అయింది విజయ్ దేవరకొండతోనే అని అందరికీ తెలుసు. ఇప్పటికే ఈ లవ్ బర్డ్స్ తమ రిలేషన్‌షిప్‌పై పలుమార్లు హింట్స్ ఇచ్చారు. తరచూ జంటగా వెకేషన్స్ కు వెళ్లడమే కాకుండా డిన్నర్లు, డేట్లు అంటూ గత కొన్నేళ్ల నుంచి విజయ్, రష్మిక ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. రేపో మాపో పెళ్లి కూడా చేసుకోవడం ఖాయమని పరోక్షంగా యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ కన్ఫార్మ్ చేశారు.