టీడీపీ నేతలపై పోలీసుల లాఠీలు విరుచుకుపడ్డాయి. వెతికి వెతికి మరీ టీడీపీ నేతలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు.. లాఠీలతో కుళ్లబొడిచారు. పోలీసుల నుంచి తప్పించుకునేందు కు పరుగులు పెట్టిన కొందరిని వెంటబడి మరీ.. పోలీసులు లాఠీలను ప్రయోగించారు. మరి దీనికి కారణం.. ఏంటి? టీడీపీ నేతలు చేసిన ఘోరం.. నేరం .. ఏంటి? అంటే.. ప్రభుత్వం తీసుకువచ్చిన వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్)ను అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించడమే!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చె న్నాయుడు సూచన మేరకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీఎస్‌ను రద్దు చేసి పేదలకు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనే డిమాండ్‌తో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ఇదంతా కూడా అహింసాయుత మార్గంలోనే చేపట్టారు. ఈ క్రమంలో గుంటూరు నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే ప్రయత్నం చేశారు.
అయితే.. తాము కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదని.. పేర్కొంటూ.. ఒక్క పెట్టున పోలీసులు టీడీపీ కార్యకర్తలు, నేతలపై విరుచుకుపడ్డారు. నేతలను గెంటేశారు. ఈ క్రమంలో పోలీసులు.. టీడీపీ నేతలకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
అయితే.. దీనిని అదునుగా చూపుతూ.. పోలీసులు మరింతగా రెచ్చిపోయారు. టీడీపీ నేతలను చెదరగొట్టేందుకు లాఠీలను ఝళిపించారు. అయితే.. ఇందేంటని.. నేతలు ప్రశ్నించారు. దీనికి కనీసం సమాధానం కూడా చెప్పని పోలీసులు.. మరింతగా రెచ్చిపోయారు.
దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు పరుగులు పెట్టారు. అయితే.. వపోలీసులు రోడ్డు డివైడర్‌ను కూడా దాటుకుని వచ్చి.. వెతికి వెతికి మరీ టీడీపీ నేతలపై విరుచుకుప డ్డారు. దీంతో పలువురు నేతలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరికొందరు కిందపడిపోయారు.
పోలీసుల చర్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు.జివి ఆంజనేయులు మరియు జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు.. పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.