రాజకీయ నాయకులు అంటే.. చెప్పేది ఒకటి చేసేది మరొకటనే పేరుంది . ఎక్కడో ఒకరిద్దరు తప్ప.. ఎవరూ నిజాలు చెప్పరు. కానీ, పిడుగురాళ్ల మాధవి ఆ దారి ఎంచుకోలేదు. తాను ఏం చేయాలని అనుకుంటున్నారో.. అదే చెబుతున్నారు. ఎవరి గొం తెమ్మ కోరికలో తీరుస్తానని అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకొనే పరిస్తితి అంతకన్నా లేదు. ఉన్నది ఉన్న ట్టే మాట్లాడుతున్నారు. ఆమే గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి న పిడుగురాళ్ల మాధవి.
ఉన్నది ఉన్నట్టే చెబుతున్నారు. నిజాలే మాట్లాడుతున్నారు. ఇది నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. `మాధవి బెటర్ నుంచి ఇప్పుడు బెస్ట్.. ది బెస్ట్“ అనే రేంజ్‌కు ఎదిగిపోయారు. దీనికి కారణం.. బీజేపీతో కలిసి ఉన్న మీరు మైనారిటీలకు ఏం న్యాయం చేస్తారన్న ప్రశ్నకు ఆమె తడుము కోకుండా.. నిజాయితీగా సమాధానం చెబుతుండడమే. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడాన్ని వైసీపీ నాయకురాలు, మంత్రి, గుంటూరు వెస్ట్ నుంచే పోటీ చేస్తున్న విడదల రజనీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
మైనారిటీల హక్కులు పోతాయని.. వారిపై దాడులు జరుగుతాయని.. బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకంగా చట్టాలు చేసిందని.. ఆ పార్టీతో కలిసిన టీడీపీని నమ్మవద్దని రజనీ ప్రచారం చేస్తున్నారు. దీనిపైనే మాధవి వివరణ ఇస్తున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు కొత్తకాదు. ఈ విషయం మైనారిటీలకు కూడా తెలుసు. గతంలో 1990లలోనూ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లింది. 2014లోనూ బీజేపీతో కలిసి పోటీ చేసింది. ప్రభుత్వంలోనూ టీడీపీ బీజేపీనేతలకు అవకాశం ఇచ్చింది.
అయితే.. ఎక్కడా మైనారిటీల హక్కులకు భంగం కలిగించలేదే? అంతేకాదు.. వారిపై ఎక్కడా దాడులు కూడా జరగలేదే. అంతేకాదు.. దుల్హన్, షాదీముబారక్, రంజాన్ తోఫా, మౌలానాలకు పారితోషికం.. వంటి అనేక పథకాలు అమలు చేసింది ఎవరు? టీడీపీ కాదా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన టీడీపీ ఎక్కడైనా ఎప్పుడైనా వారిని వదిలేసిందా? అనేది రజనీనే సమాధానం చెప్పాలి. అంతేకాదు.. మైనారిటీ వర్గాలు కూడా.. ఈ విషయాన్ని ఆలోచించాలి.
అనేక పథకాలతో టీడీపీ మైనారిటీ ముస్లింలను ఆదుకుంది. అంతేకాదు.. శాసన మండలి చైర్మన్‌గా ముస్లిం మైనారిటీకి చెందిన షరీఫ్‌కు అవకాశం కల్పింది కూడా టీడీపీనే. అంతేకాదు.. ఎన్ ఎం డీ ఫరూక్‌కు ఎంఎల్సీ పదవిని ఇచ్చిన డిప్యూటీ చైర్మన్‌ను చేయలేదా? ఇవన్నీ వదిలేసి.. రజనీ చెబుతున్న కాకమ్మ కబుర్లు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. పైగా.. మైనారిటీలకు కీలకమైన వక్ఫ్ బోర్డును బలోపేతం చేసి.. వారి భూములకు రక్షణ కల్పించింది కూడా టీడీపీ ప్రభుత్వమే.
ఇక, మైనారిటీ ముస్లింలు ఏటా చేసే మక్కా యాత్రకు ప్రత్యేకంగా కేంద్రంతో మాట్లాడి కోటాను పెంచడంతో పాటు గన్నవరం నుంచే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయించి.. వారి ఖర్చులో 50 శాతం ప్రభుత్వమే ఇచ్చింది. ఇవన్నీ.. మరిచిపోయినట్టుగా రజనీ ఇప్పుడు ఎదురు దాడి చేసి మైనారిటీల ఓటు బ్యాంకును టీడీపీకి దూరం చేసేలా కుయుక్తులు పన్నడం ఎంత వరకు సబబు. మైనారిటీలు ఈ విషయాన్ని గ్రహించాల్సి ఉంది. మాధవిని గెలిపించుకోవడం ద్వారా వారి ఓటును ఆమెకు వేయడం ద్వారా తమను తాము గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.