తెలుగులో కొత్త తరహా కథాకథనాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి.. ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాల్లో పెళ్ళిచూపులు ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమాతోనే తరుణ్ భాస్కర్ అనే టాలెంటెడ్ ఫిలిం మేకర్ తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. తరుణ్ తీసిన రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’లో కూడా విజయ్ చిన్న క్యామియో చేసిన సంగతి తెలిసిందే. తరుణ్‌కు వ్యక్తిగతంగా కూడా మంచి ఫ్రెండైన విజయ్.. తన కొత్త చిత్రం ‘కీడా కోలా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన తన మిత్రుడి గురించి, అతడితో తన అనుబంధం గురించి చాలా బాగా మాట్లాడాడు.
తామిద్దరం చేతిలో రూపాయి లేకున్నా ప్రపంచాన్ని ఏలేయగలం అనే కాన్ఫిడెన్స్‌తో తిరిగే వాళ్లమని.. ఆ కాన్ఫిడెన్సే తమను ఇక్కడిదాకా తీసుకొచ్చిందని విజయ్ చెప్పాడు. మధ్య తరగతి నేపథ్యం నుంచి వచ్చినా ఏమైనా చేయొచ్చు అనడానికి తామిద్దరమే ఉదాహరణ అని విజయ్ అన్నాడు. ఈ మాటలన్నీ అయ్యాక అభిమానులకు ఒక క్రేజీ న్యూస్ చెప్పాడు విజయ్. త్వరలోనే తాను, తరుణ్ కలిసి సినిమా చేయబోతున్నట్లు అతను వెల్లడించాడు.
‘పెళ్ళిచూపులు’ తర్వాత మళ్లీ కలిసి సినిమా చేయాలని తామిద్దరి అనుకున్నప్పటికీ ఇప్పటిదాకా కుదరలేదని.. ఈ మధ్యే తరుణ్ తన కోసం ఒక స్క్రిప్టు రాసి తీసుకొచ్చాడని.. అది తనకెంతగానో నచ్చిందని.. అతి త్వరలో తమ కాంబినేషన్లో సినిమా మొదలవుతుందని అభిమానుల కేరింతల మధ్య ప్రకటించాడు విజయ్. విజయ్, తరుణ్ కాంబినేషన్లో మళ్లీ సినిమా అంటే.. దానిపై అభిమానుల్లో భారీ అంచనాలుంటాయనడంలో సందేహం లేదు. మరి విజయ్ స్టేజ్ మీద చెప్పిన మాటలు కార్యరూపం దాల్చి ఈ కాంబినేషన్ త్వరలోనే తెరపైకి వస్తుందేమో చూడాలి.