పవన్ కళ్యాణ్ గురించి ఎంతో మంది అతనికి క్లారిటీ లేదు అంటుంటారు
అయినా వారు పవన్ అంటే పడక అలా అంటారులే అని చాలామంది సర్దుకునే వారు
కానీ పవన్ కి నిజంగా క్లారిటీ లేదేమో అన్న అనుమానం తాజా మీటింగ్ తో ఫుల్ క్లారిటీ వచ్చేంది.
ఈరోజు పవన్ పొత్తులపై మాట్లాడారు.
సాధారణంగా ఎవరైనా పొత్తు పెట్టుకుంటాం అంటుంది. లేదా పెట్టుకోం అంటుంది. పొత్తు అంటూ ప్రకటిస్తూ ఆయా పార్టీలతో చర్చించాకే ప్రకటిస్తుంది.
కానీ పవన్ నేడు చాలా విచిత్రమైన ప్రకటన చేశాడు.
ఆయా పార్టీలతో పొత్తు అనేది చర్చించకుండానే వారితో పొత్తుకు సిద్ధమని బహిరంగంగా ప్రకటించేశాడు. పోనీ అందులో అయినా క్లారిటీ ఉందా అంటే అదీ లేదు.
మా ముందు మూడే Possibilities ఉన్నాయి అని చెప్పిన పవన్ తన ఆప్షన్లు చెప్పాడు.
1. బీజేపీ మనము కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం
2. జనసేన + బీజేపీ + టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం
3. జనసేన ఒక్కటే స్థాపించడం
మూడో ఆప్షన్ బట్టి చూస్తే ఎవరూ కలిసి రాకపోతే మేమొక్కరే పోటీ చేస్తామని చెప్పినట్లు అర్థమవుతుంది
అదేదో ముందే ఆ పార్టీలతో క్లారిటీ తీసుకుని పొత్తు ఎవరితో ఉంటుందో చెప్పేస్తే అయిపోతుంది కదా
ఇందులో పవన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే… పొత్తు ఆప్షన్లలో బీజేపీని మిస్సయ్యేదే లేదన్నట్లు చెప్పాడు.
2014 కాంబినేషనుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించాడు. కానీ అదేదో అంతర్గతంగా మాట్లాడకుండా ఇలా అనడం వల్ల పవన్ కు భారీ డ్యామేజీ తప్పదు. మరెందుకు అలా అన్నాడో అర్థం కాదు.
విచిత్రం ఏంటంటే… టీడీపీ క్యాడరు మొత్తం నీ వాసనే వద్దురా బాబోయ్ మాకు అని పవన్ ట్రోల్ చేస్తోంది.