గత కొద్ది రోజులుగా పవన్ స్టైల్ మారింది.
రోజూ ఫీల్డ్ లోకి రాకుండానే వైసీపీకి దడ పుట్టిస్తున్నాడు పవన్
వైసీపీతో మైండ్ గేమ్ ఆడుతూ వారిని ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తున్నాడు.
పవన్ నుంచి ఇలాంటి ట్విస్టులను వైసీపీ అస్సలు ఊహించలేదు.
పవన్ ప్రతి మాటా పేలిపోతున్నాయి. దీంతో వైసీపీకి దిమ్మ తిరుగుతోంది.
తాజాగా వేసిన పవన్ ట్రెండీగా వేసిన పంచ్ ఓ రేంజ్ లో పేలింది.
‘‘మన రాష్ట్ర సీఎం ఇల్లు కదలరని, ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి’’ అని జనసేన ప్రత్యేకంగా ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఓవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. జిల్లాకు రూ.2 కోట్ల సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందని, జగన్ ఏమాత్రం పరిపాలన దక్షత లేని వ్యక్తిగా తయారయ్యారని జనసేన విమర్శించింది.
వివాహాలు, విందులకు హాజరయ్యేందుకు తీరిక ఉన్న సీఎం జగన్ కు తుపాను బాధితులను ఆదుకోవడానికి తీరిక లేదా? సొంత జిల్లాలో బాధితులను పరామర్శించేందుకు ఎందుకు వెళ్ళడం లేదు? అని జనసేన ప్రశ్నించింది.
వరదలకు సంబంధించి జనసేన స్టాండ్, ప్రభుత్వాన్ని నిలదీస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇసుక మాఫియా కోసం ఈ వరద సృష్టించారని జనసేన చేసిన ఆరోపణ ఈరోజంతా వైరల్ అయ్యింది. ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్.
మరో సంచలన విషయాన్ని కూడా జనసేన వెలుగులోకి తెచ్చింది.
బాధిత ప్రజలు ఉన్న దగ్గర హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం గుడ్ డే బిస్కట్ ప్యాకెట్లను జారవిడిచింది. ప్రభుత్వ హెలికాప్టర్ ద్వారా మంచినీళ్లో, బోజన ప్యాకెట్లో వస్తాయని భావించిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గుడ్ డే బిస్కట్ ప్యాకెట్లను చూసి హతాశులయ్యారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా?
ఈ విషయంలో రాష్ట్రంలో చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని పవన్ వెల్లడించడంతో రాష్ట్ర ప్రజలందరూ షాక్ తిన్నారు. దేశ చరిత్రలో ఏ వరద ప్రాంతంలోను ఇలా ప్రభుత్వం బిస్కెట్లు ఇచ్చి కకృతి పడిన సందర్భాలు లేనేలేవు. ఈ విషయం తెలిసి ప్రభుత్వాన్ని తిట్టని వారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. వరదలో ఉన్నోడికి కనీసం 24 గంటల పాటు ఆహారం కూడా దొరికి ఉండదు. అలాంటి వారికి బిస్కెట్లు ఇస్తే వాళ్లు ఎలా బతికి బట్టకడతారు. ఏమిటీ దారుణం?
సాంకేతికంగా కూడా జనసేన వేసిన ప్రశ్నను అందరూ సమర్థిస్తున్నారు. అదేంటంటే…
చిన్నపాటి పిడుగు పడినా 45 నిమిషాల ముందుగానే తెలుసుకునే టెక్నాలజీని చంద్రబాబు హయాంలోనే ఏపీ ప్రభుత్వం సమకూర్చుకుంది. అంతేకాదు, భారీ తుపాను వస్తుందంటే కనీసం నాలుగైదు రోజుల ముందుగానే అదే టెక్నాలజీ సహాయంతో తెలుసుకోవచ్చు. ప్రకృతి విపత్తుల నివారణ శాఖ ఇందుకోసమే ప్రత్యేకంగా పని చేస్తుంది. మరి వారంతా నిద్రపోతున్నారా… ప్రభుత్వం దీన్ని తెలుసుకోవడంలో అలసత్వం ప్రదర్శించింది. ముందుగా సీఎం జగన్ ఎవరినీ అప్రమత్తం చేయకపోవడం విచారకరం. ఆ తప్పు వల్లే రాష్ట్రంలో ఇంత ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
జనసేన రైజ్ చేసిన ఈ పాయింట్ నిజంగా వాలిడ్. సంక్షేమ పథకాల బటన్ నొక్కి జనానికి చిల్లర పంచడం తప్ప… వారు నిజంగా కష్టాల్లో ఉన్నపుడు వారికి అండగా నిలిచే శక్తి, నాయకత్వ లక్షణాలు జగన్ లో లేవన్నది ప్రతిపక్షాల ఆరోపణ.
ప్రభుత్వం చేసిన తప్పులను జనం భాషలో జనసేన హైలెట్ చేసిన తీరు అభినందనీయం. మొత్తాన్ని జనసేన యాక్టివ్ నెస్ జగన్ ను ఇరుకున పడేసిందనే చెప్పాలి.