విశాఖ ఉక్కుపై జనసేన కూడా పట్టు బిగించింది. మొదట్నుంచి చాపకింద నీరులా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం మద్దతు పలుకుతోంది. ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తిన తర్వాత వెనక్కు తగ్గి కేవలం మోడీకి లేఖలు రాస్తూ కూర్చుంది.
చిన్నగా విశాఖ ఉద్యమం రాజుకుని నేడు ప్రైవేటీకరణ ఆపేదాకా పోరాటం ఆగదని చెబుతోంది. విశాఖ ఉక్కు నిర్వాసితులు, ఉద్యోగులు, వైజాగ్ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇస్తున్నాయి. వైసీపీ మాత్రం దూరం దూరంగా ఉంటోంది.
తెలుగుదేశం మొదట్నుంచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుపడుతోంది. తాజాగా జనసేన వాయిస్ కూడా తోడైంది. దీంతో ఉద్యమకారుల్లో ఉత్సాహం నమ్మకం పెరిగాయి.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు నిర్వాసితులు ఏమన్నారో వారి మాటల్లో తెలుసుకుందాం.
నాడు అర్హతతో సంబంధం లేకుండా ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి భూములు లాక్కుని ఈరోజు ఎన్నో అర్హతలు పెడుతున్నారు, అప్పులు చేసి చదువుకుని అర్హత సాధించినా సరే ఉద్యోగాలు ఇవ్వడం లేదుఇది బెదిరింపు కాదు, మా బతుకులు పోయాయి, మా జీవితాలు పోయాయి, అవసరమైతే చంపడనికైనా చావడానికైనా సిద్ధం. స్టీల్ ప్లాంట్ రక్షించుకుని తీరుతాంమా జీవితాలు బాగుంటాయి అని మా కన్నతల్లి లాంటి భూమిని త్యాగం చేస్తే మా నాన్న గారికి ఉపాధి ఇవ్వలేదు, ఇప్పుడు నా వయసు 35 సం.లు వచ్చినా సరే ఉపాధి ఇవ్వలేదు దేనికోసం మేము త్యాగాలు చేయాలి .64 గ్రామాల ప్రజలు వారి జీవితాలను, వారి జీవన ఉపాధిని త్యాగం చేస్తే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయింది. అలాంటి పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది.
10 – 12 వేల ఎకరాల పరిశ్రమ మిగులు భూములపై కొంతమంది కన్ను పడింది. అందుకే ఈ ప్రయివేటీకరణకు అండగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీనిని అడ్డుకొని పరిశ్రమను కాపాడుకోవాలి.
రైతాంగ చట్టాలు వెనక్కి తీసుకోవాలంటూ రైతాంగ నాయకులు రాకేష్ టికాయత్ గారు పోరాటం చేస్తే ఈరోజు కేంద్రం ఆ చట్టాలు వెనక్కి తీసుకుంది, అలాంటిది అందరం కలిసి పోరాటం చేస్తే ప్రయివేటీకారణ అడ్డుకోలేమా
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ప్రాణత్యాగలు చేశారు. కనీసం ఈ విషయాలైనా వైసీపీ ప్రభుత్వానికి తెలుసో లేదో
అమరావతి రైతులు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నాడు విశాఖ ప్రాంతం వారు ఉక్కు పరిశ్రమ కోసం భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే, నేడు రాజధాని కోసం భూములు త్యాగం చేసి రైతులం ఇబ్బంది పడుతున్నాం. అందరికీ న్యాయం జరగాలి అని రాజధాని మహిళా రైతులు ఆకాంక్షించారు.
వైసీపీ నాయకులారా? మీ పార్టీ ఎంపీ రఘురామరాజుపై పెట్టిన శ్రద్ధ విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం పెట్టి ఉంటే ఈరోజు ఈ ప్రయివేటీకరణ సమస్య ఉండేది కాదు అని జనసేన నేత నయూబ్ కమల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.