టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు.
చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను బాబు స్వయంగా సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఇద్దరు చర్చించుకున్నట్టు సమాచారం. చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రభుత్వ దమనకాండపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.
ఫాసిస్ట్ జీవో 1 రద్దుకు, ప్రజా పోరాటాలు కలిసి చేసి ప్రజలకు ఈ అరాచక పాలన నుంచి విముక్తి కలిగంచడానికి రచించాల్సిన వ్యూహాల గురించి వారు చర్చించుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్…..
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ….
చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రభుత్వ దమనకాండపై చర్చ…. @ncbn @PawanKalyan pic.twitter.com/pJ3BAftk41
— Team Lokesh (@Srinu_LokeshIst) January 8, 2023