వైసీపీ నేతలు వర్సెస్ పవన్ కల్యాణ్ వార్ ముదిరి పాకాన పడుతోన్న సంగతి తెలిసిందే. పవన్ పై వైసీపీ మంత్రులు, సినీ నటుడు పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంగళగిరిలో పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. పవన్ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటారేమోనన్న అనుమానాల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ మరోసారి వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నేతలను శునకాలతో పోల్చుతూ పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. జనసైనికుల సింహ గర్జనలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమని, గ్రామ సింహాలు అంటే కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చికుక్కలు, ఊరకుక్కలు అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం పుష్కలంగా ఉన్నాయని, వారికి లేనిదల్లా భయం అని, భయం అంటే ఏమిటో వారికి తాను నేర్పిస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
ఆ సన్నాసులకు వారి తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం మనం నేర్పలేమని, బూతులు మాట్లాడాలనుకుంటే తాను వైసీపీ నేతలకంటే బాగా మాట్లాడతానని అన్నారు. బాపట్లలో పుట్టిన వాడినని, తనకు బూతులు రావా అని పవన్ అన్నారు. జగన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ని ఎవరు హత్య చేసారని అడిగితే…పవన్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని వైసీపీ నేతలు అడగడం హాస్యాస్పదమని అన్నారు.
తాను కేవలం సినిమా టికెట్ల రేట్ల గురించి, ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి మాత్రమే మాట్లాడానని పవన్ క్లారిటీ ఇచ్చారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తన వ్యక్తిగత జీవితం బ్లాక్ అండ్ వైట్ అని అన్నారు. తన గురించి వైసీపీ నేతలు న్యూస్ చానెళ్లలో ఏదో మాట్లాడుతున్నారని, అదే సమయంలో ఊరకుక్కలు బయట మొరుగుతున్నాయని…ఇద్దరికీ పెద్ద తేడా లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.