జగన్ కనుమ రోజు గోపూజ చేశారు. ఎన్నికలకు ముందు స్వామి ముంచితే గంగలో మునిగాడు. ఆరోజు ఆయన మెడలో శిలువ ఉంది అది వేరే విషయం. భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల్లో ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన మతం అనుసరించే అవకాశం, హక్కు ఉన్నాయి.
కానీ ఇతర మతాలపై, మత విశ్వాసాలపై, గుళ్లపై దాడి చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అలా చేయడం ఘోరమైన నేరం. చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం. కానీ హిందు గ్రామాల్లోకి ప్రవేశించి అమాయక ప్రజల మెదళ్లలో మతాన్ని నూరిపోసి వారిని తమ మతంలోకి మార్పించుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ఆలయాలపై దాడికి పాల్పడుతున్నారు. జనం మతం మారినంత మాత్రాన దేవుడి ఆలయాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏముంది?
గుడి ఉంటే అది ఒక చారిత్రక కట్టడంగా ఉండిపోతుంది…. మరి ఏ ఉద్దేశంతో ఆ గుడిని నాశనం చేస్తున్నారు. ఇది మనం మాట్లాడుతున్నది కాదు పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి స్వయంగా బహిరంగంగా వీడియోలో వెల్లడించారు. దానిని యుట్యూబులో పెట్టారు. అది వైరల్ అయ్యింది. గుళ్లను, హిందు విగ్రహాలను నాశనం చేయడాన్ని ఆయన గర్వంగా ఫీలవుతున్నారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే… హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతుంటే ప్రభుత్వం హిందువుల్లో ఏర్పడిన అభద్రతను పారదోలడానికి ప్రయత్నం చేయడం లేదు. రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. దీనికోసం పోలీసులను కూడా వైసీపీ ప్రభుత్వం వాడుకోవడం విచారకరం.
ఇదిలా ఉంటే… పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం బయటకు వచ్చాక.. వైసీపీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ వైసీపీ మంత్రులకు, ఎంపీలకు సన్నిహితుడు అని తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని రాజుగారు బహిరంగంగా వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ వైసీపీతో అంట కాగుతూ దేవుడి విగ్రహాలను నాశనం చేసిన విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాక కూడా ఇతరుల మీద నింద వేయాలనుకోవడం వైసీపీ అమాయకత్వం అవుతోంది.
ఏపీలో ఆలయాలపై దాడులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో అందరికీ తెలుసు. దాడుల వెనుక ఎవరున్నారో కూడా కొందరికి క్లారిటీ ఉంది. తాజాగా పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం బయటకు రావడంతో వైసీపీ ఉలిక్కిపడింది. అతను సాధారణ పాస్టర్ అయితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. వైసీపీ మంత్రులకు సన్నిహితుడు అయిన పాస్టర్. అతనే స్వయంగా గుళ్లను, దేవుళ్లను నాశనం చేసినట్లు కూడా చెప్పేశాడు. దీంతో ప్రజలు ఇంకా హర్ట్ అయ్యారు. హిందువులను ఇంత దారుణంగా టార్గెట్ చేస్తారా అన్న బాధ ప్రజల్లో పెరిగిపోయింది.
ప్రవీణ్ వ్యవహారంతో జగన్ కి బాగా డ్యామేజ్ జరగడంతో చివరకు కనుమ రోజు గోపూజ చేసి ఆ ఫొటోలు అందరికీ విడుదల చేసి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా పాస్టర్ ప్రవీణ్ చేసిన డ్యామేజీ ముందు అవి నిలవలేకపోయాయి. రేపో మాపో పాస్టర్ ప్రవీణ్ కి బెయిలు వచ్చిందంటే… కచ్చితంగా ప్రజలకు కోపం రాకమానదు.