హిందువులూ..జగన్ చేతిలో తస్మాత్ జాగ్రత్త-బుచ్చి రామ్ ప్రసాద్

ఆలయాల నిర్మాణం, గో పూజలు కాదు జగన్ చేయాలసింది దేవాలయాపై దాడులు చేసిన వారిని పట్టుకొని శిక్షించడం.ఇకపై దాడులు జరగనివ్వనని హామీ ఇవ్వడం. మత మార్పిడిలు చెయ్యడం ఆపాలి.నిత్యం మత గ్రంధం చేతపట్టి క్రైస్తవులకు వైఎస్ చేసిన మేలు మర్చిపోవద్దని, క్రైస్తవులందరూ జగన్ కు మద్దతు ఇవ్వాలని బ్రదర్ అనిల్ ప్రార్ధనలు చెయ్యడం మత ప్రచారం కాదా.? దేవాలయాల నిర్మాణం, గోపూజల ముసుగులో మోసం చెయ్యడానికి మీరు పూనుకున్నారు. జగన్ జగత్ కీలాడి.రంగస్థల నటులు కూడా జగన్ నటన ముందు సరిరారు.. ప్రజలను ఏదో విధంగా మోసం చెయ్యడమే జగన్ నైజం. వంచనలో ఆరితేరడమే జగన్ రాజనీతి.మోస గాళ్ళు అందరూ మోసం చేయడం జగన్ వద్ద నేర్చుకొన్నవారే.
జగన్ అండ్ కో కంపెనీ అంతా టక్కు టమారా విద్యలు ప్రదర్శించి జనాన్ని బురుఢీ కొట్టించడంలో ప్రావీణ్యులు.హిందువుల 150 గుళ్ళను, విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఉండి ఒక్క మాట మాట్లాడకుండా హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన  జగన్ కి నేడు దేవుళ్ళ పట్ల భక్తి ప్రదర్శిస్తూ హిందువులను గోపూజ రూపంలో మోసం చెయ్యాలని చూస్తున్న జగన్మాయ గాళ్ల పట్ల హిందువులు అంతా అప్రమత్తంగా ఉండాలి.తాను హిందువులకు చేసిన ద్రోహానికి ముసుగులేసి కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పంచెలు కట్టి దేవాలయాల నిర్మాణనికి, గో పూజలకు పునుకొన్నారు తప్ప దేవుళ్ళ పై భక్తితో మాత్రం కాదు.కావున హిందువులూ..తస్మాత్ జాగ్రత్త.మేక వన్నె పులి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి 'బుచ్చి రామ్ ప్రసాద్' విరుచుకు పడ్డారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.