తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా అమెరికా తో సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు NRI TDP కమిటీలను ప్రకటించింది.
రాబోవు రెండు సంవత్సరాలలో ఈ కమిటీలు తెలుగు రాష్ట్రాలలోని రాష్ట్ర, జిల్లా, గ్రామ కమిటీలతో అనుసంధానమై పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయబోతున్నాయి.
ఈ కమిటీ ముఖ్య ఉద్దేశ్యం అనేక దేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను, సానుభూతి పరులను ఒక తాటిపైకి తీసుకువచ్చి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టిడిపిని అధికారంలోకి తీసుకు రావటం.
అందులో భాగంగా లాస్ ఏంజలెస్ ఎన్నారై ఎగ్జిక్యూటివ్ కమిటీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించడం జరిగింది.
వెంకట్ ఆళ్ల అధ్యక్షులుగా, సురేష్ అంబటి ఉపాధ్యక్షులుగా, రాహుల్ వాసిరెడ్డి సెక్రెటరీగా, విష్ణు అటుకారి ట్రెజరర్ గా, హేమకుమార్ గొట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా, చందు నంగినేని రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా నియమించడం జరిగింది.
ఈ సందర్భం గా వెంకట్ ఆళ్ల మాట్లాడుతూ, తన మీద నమ్మకం తో ఈ బాధ్యతని అప్పగించిన జయరాం కోమటి మరియు డాక్టర్ రవి వేమూరి లకు ధన్యవాదాలు చెపుతూ, లాస్ ఏంజలెస్ ప్రాంతంలో ఉన్న పార్టీ అభిమానులను, ఒక్క తాటి మీదకు తెచ్చి, చంద్రబాబు ని మరల ముఖ్యమంత్రి ని చేయడంలో తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు.