యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ ముస్లిం మైనారిటీ విభాగం, నారా హమారా టిడిపి హమారా ఆత్మీయ సమావేశం, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ గారి సూచనలు మరియు గల్ఫ్ కౌన్సిల్ సభ్యలు వెంకట్ కొడూరు గారి సలహాలు మేరకు, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి అధ్యక్షతన జరిగినది.
ఇందులో ఆంద్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వంలో మైనారిటీ సోదరి సోదరమనులు ఎదుర్కొంటున్న సమస్యలను, పలువురు మైనారిటీలు, రాజకీయాలకు అతీతంగా, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ ద్వారా, మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితో జరిగిన మైనారిటీల ఆత్మీయ సమావేశానికీ మద్దతు గా, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ ముస్లిం మైనారిటీ విభాగం మేము సైతం అంటూ మద్దతు తెలియ చేశారు.
అదేవిదంగా యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి లో భాగంగా, గొప్ప వారసత్వం కలిగిన మైనారిటీల సంస్కృతి పరిరక్షణ. మైనారిటి ల సాంప్రదాయక వృత్తుల పరిరక్షణ, శిక్షణ, అధివృద్ధికి రూపొందించే రాష్ట్రాల వక్ఫ్ బోర్డు ల నిర్వహణ కు అవసరమైన శిక్షణ, పరిపాలక ధనాన్ని అందించుట, వక్ఫ్ ఆక్రమణలను తొలగించుట, మరియు వక్ఫ్ బోర్డు ల జోనల్/రిజినల్ ఆఫీసులను ఏర్పాటు చేయుట. అంశాలను కూడా పరిగణలోనికి తీసుకొని, వాటిని మన జాతీయ నాయకులు నారా చంద్రబాబు దృష్టికి వచ్చే విదంగా, ఈ సమావేశాన్ని కువైట్ లో నిర్వహించామని తెలియచేసారు.
యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ గల్ఫ్ సభ్యలు వెంకట్ కోడూరి గారు మాట్లాడుతూ , జగన్ ప్రభుత్వంలో జరుగుచున్న, వక్స్ భూములు అన్యాక్రాంతం, తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టిన మసీదులు, షాదిఖానాలు మొదలగు చాలా పనులను పూర్తి చెయ్యలేదు, అడిగితే తప్పుడు కేసులు పెడతారు,, ముస్లింలపై భౌతిక దాడులు చేస్తారు, ఇది ప్రజా ప్రభుత్వామా లేక ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా అనిఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిదంగా యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ ఉపాధ్యక్షులు షేక్ రహమతుల్లా మాట్లాడుతూ, ఈ రోజు రంజాన్ తోఫా లేదు, మైనార్టీ కార్పొరేషన్ నిదులు లేవు, దుకాన్ మకాన్ లేదు , విదేశీ విద్యాధరణ పథకం లేదు, యన్.టి.ఆర్.వున్నత విద్య లేదు , దుల్హన్ పథకం లేదు , మసీదులకు మరమ్మతులు లేవు , రంజాన్ కు నిదులు లేవు, ఉర్దూ బాషాబివృద్దికి చర్యలు లేవు, షాధిఖనాలు నిలిపివేశారు, , చంద్రన్న అదికారం లోనికి రావడం ముస్లిం సామాజిక వర్గానికి వున్న సమస్యలన్నీ తీర్చవలసిందిగా యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ తరూపన విన్నవించు కొంటు, చంద్రన్న ముస్లిం ఆత్మీయ సమావేశానికి అందరం కలసి మద్దతు నిస్తున్నాము.
అదేవిదంగా యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అసమా గవర్నరేట్ కొ ఒర్డినటర్ మూస్టాక్ ఖాన్ మాట్లాడుతూ, 1983లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే, 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసీన ఘనత తెలుగుదేశం పార్టీది, అదేవిదంగా ఉర్దూను రెండో అధికార భాషగా చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడం కోసం… హైదరాబాద్ లోనే హజ్ హౌస్ కట్టి, హజ్ యాత్రకు ఆర్థిక సాయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ స్థాపించి, విభజన జరిగిన తరువాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నిర్మించిన ఘనత కూడా ఘనత తెలుగుదేశం పార్టీది, గత ప్రభుత్వాలు ఎవ్వరూ చేయలేని 10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చి, సంక్రాంతి సమయంలో సంక్రాంతి కానుక కూడా ముస్లింలకు వర్తింప జేసీన ఘనత మనది, మన పార్టీ టీడీపీధె, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదే అని తెలియచేసారు.
అదేవిదంగా ఈ సమావేశానికి ప్రదానకార్యదర్శి మల్లి మరొతు సెలవులో వున్నందున తన సందేశాన్ని మైల్ ద్వారా అధ్యక్షులకు పంపడం జరిగినది, కోశాధికారి మోహన్ రాచూరి, సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాసరాజు వెలిగండ్ల, నాలుగు గవర్నరేట్ల మైనారిటీ కొ ఒర్డినటర్లు మాట్లాడుతు, 2014 మన ప్రభుత్వం వచ్చిన తరువాత దుకాన్ మకాన్, దుల్హన్ పథకం తీసుకొని వచ్చిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తరువాత పెళ్లి కానుక కింద లక్ష ఇస్తాను అని చెప్పి. నిలిపివేశాడు.
కానీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముందుగా నే చెప్పాడు టీడీపీ వచ్చిన తరువాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకువస్తా అని . జగన్ రెడ్డిలా మోసం చెయ్యను…అని, దుల్హన్ పథకం కింద లక్ష చెల్లిస్తా. అని చెప్పి, ఆయనకు గల్ఫ్ లో వున్నటువంటి ముస్లిం సామాజిక వర్గం మొత్తం కూడా ఆనందముతో, మద్దతు తెలుపుతూ, దన్యవాదములతో, చంద్రన్నకు జై కొట్టి , చంద్రన్న వెంట నడుస్తామని ఒకే గొంతుకతో వాగ్దానం చేయారు.
నాలుగు గవర్నరేట్ల కొఒర్డినేటర్స్, రమేష్ కొల్లపనేని, ముష్తాక్ ఖాన్, రెడ్డియ్య చౌదరి, హేమంత్ రాయల్ మల్లెo, అదేవిదంగా, జాయింట్ కొ ఒర్డినేటర్స్, శంకర్ యాదవ్ వలసాని, విజయ్ కుమార్ పసుపు లేటి, నరసింహులు, వెంకటేష్, సోషల్ మీడియా కార్యదర్శులు, ప్రోగ్రాం కార్యదర్శులు, సభ్యత్వ కార్యదర్శులు, బీసీ విభాగం బొమ్ము నరసింహులు, నాలుగు గవర్న రెట్ మైనారిటీ విభాగం కొఒర్డినేటర్స్ , సయ్యద్ రహమత్ అలీ, షేక్ ఖదీర్ బాషా, టీ అబ్దుల్ కరీమ్, సయ్యద్ కరీముల్లా, జాయింట్ కొఒర్డినేటర్స్, నదీముల్లా కరీముల్, షేక్ మౌలాలి, ఎమ్ జలీల్ అహమ్మద్, షేక్ మొహమ్మెద్, అదేవిదంగా ప్రముక సీనియర్ నాయకులు, యనిగల బాలకృష్ణ గారు , చలపతి గారు, పేరూరు రామకృష్ణ,గారు ఈ కార్యనికి హాజరు అయి జయప్రదం చేసినందుకు యన్.ఆర్.ఐ. టిడిపి కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి ధన్యవాదములు తెలియచేసారు .