డల్లాస్, టెక్సాస్: మార్చ్ 26: అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగానిర్వహించే తెలుగు సంబరాలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో మినీ తెలుగు సంబరాలను నిర్వహిస్తోంది. డాలస్ వేదికగానిర్వహిస్తున్న ఈ మినీ తెలుసుసంబరాల్లో తొలి రోజు ఇర్వింగ్ లోని టొయోటా మ్యూజిక్ ఫ్యాక్టరీ లో నిర్వహించారు. ఈవేడుకల పరిచయ కార్యక్రమాన్ని (బ్యాంక్వెట్ ) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇర్వింగ్ లోని SLPS కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు.
ఈ మినీ సంబరాలకు ఆహ్వానితులుగా ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి, సినీ నటులు రవి, మెహ్రీన్, పూజఝవేరీ, సియా గౌతమ్ పాల్గొన్నారు.
నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నె, చైర్ విమెన్ అరుణ గంటి, బోర్డ్ వైస్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, పాస్ట్ ఛైర్మన్స్ శ్రీధర్అప్పసాని, డా. మధు కొర్రపాటి, వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, పాస్ట్ ప్రెసిడెంట్స్ మోహనకృష్ణ మన్నవ, శ్రీనివాస్మంచికలపూడి, బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, కిషోర్ కంచర్ల, ఆది గెల్లి, వీణ ఎలమంచిలి, డా. ఆచంట, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీకృష్ణ వెనిగళ్ల, రాజేష్ కాండ్రు, రంజిత్ చాగంటి, మదన్ పాములపాటి, జ్యోతి వనం, మురళీకృష్ణ మేడిచెర్ల, కుమార్ వెనిగళ్ల, ప్రసాద్ ఆరికట్ల, మూర్తి కొప్పాక, భాను ధూళిపాళ, తెదేపా నాయకులు ముళ్ళపూడిబాపిరాజు, అరిమిల్లి నాగరాజు, డల్లాస్ ప్రవాసులు డా. ప్రసాద్ నల్లూరి, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, కే సిచేకూరి, కొర్రపాటి శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, ఉప్పు వినోద్, సురేష్ మండువ, ఆత్మచరణ్ రెడ్డి, లోకేష్ నాయుడు తదితరులుపాల్గొన్నారు. స్థానిక ప్రవాస బాల బాలికల నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
తొలి రోజు ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. తెలుగు సినీ కళాకారులు, గాయకులు తొలిరోజు తమ ప్రతిభా పాటావాలను చూపించి తెలుగువారిని అలరించారు. తెలుగు సినీ పాటలు తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపాయి. తొలి రోజు నాట్స్ కు చెందిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వైస్ప్రెసిడెంట్లు, జోనల్ ప్రెసిడెంట్లు, చాప్టర్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
బావర్చీ వారి ప్రత్యేక విందు ఏర్పాట్లు అందరి మన్ననలను పొందాయి.
శనివారం ఉదయం 9 గంటలకు అల్పాహారం తర్వాత మొదలైన బోర్డు మరియు ఈసీ మీటింగ్ లలో రాబోయే రెండుసంవత్సరాలలో నాట్స్ చేపట్టబోయే పలు కార్యక్రమాల పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కోవిడ్ బారి నుండి కోలుకున్న తర్వాత, 2023 జూన్ 30 నుండి జూలై 2 వరకూ 7 వ అమెరికా తెలుగు సంబరాలు న్యూ జెర్సీ లోని ఎడిసన్ రారిటన్ కన్వెన్షన్సెంటర్ లో అంగరంగ వైభవంగా జరుగ నున్నట్లు బోర్డ్ చైర్ విమెన్ ఆరుణ గంటి అందరి సమక్షంలో ప్రకటించారు. ఈ 7 వ అమెరికా తెలుగు సంబరాలకు పాస్ట్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.
అనంతరం, అరుణ గంటి మాట్లాడుతూ.. భాషే రమ్యం, సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా ఎప్పటిలాగేతెలుగు వారంతా మరిన్ని సేవా కార్యక్రమాలలో ప్రవాస తోటి తెలుగువారికి అవసరమైనప్పుడల్లా ముందుండి సహాయపడుతూ, పలువురు కొత్త సభ్యులను నాట్స్ అభివృద్ధి లో భాగస్వామ్యులుగా చేసుకొంటూ ముందుకు సాగాలని అన్నిచాఫ్టర్లకూ పిలుపునిచ్చారు.