కొన్ని కొన్ని చిత్రంగా అనిపిస్తుంటాయి. వాటిని జీర్ణించుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఉదాహ రణకు యువగళం.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర అప్పుడు కుప్పం ని యోజకవర్గాన్ని దాటేస్తోంది.
భారీ ఎత్తున తరలి వస్తున్న ప్రజలు, పార్టీ అభిమానులు.. ఆయనకు సంఘీ భావం చెబుతున్నారు. అదేసమయంలో యువ నాయకుడు లోకేష్ కూడా.. వారికి అనేక హామీలు ఇస్తున్నా రు. అయితే.. ఇక్కడ కొన్ని చిన్న చిన్న విషయాలు ఆసక్తిగా మారాయి. తన దగ్గరకు వచ్చేవారిని నారా లోకేష్ ఓదార్చడం.. ప్రజలను కలుసుకోవడం.. వారి వద్దకే వెళ్లడం.. వారితో మాట్లాడడం.. సెల్ఫీలు దిగడం.. ఇలా అనేక విషయాలపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
గతంలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పాదయాత్ర చేసినప్పుడు.. సేమ్ టు సేమ్ ఇలాంటి సీన్లే అప్పట్లోనూ కనిపించాయి. అప్పట్లో జగన్ బాధిత ప్రజలను ఓదార్చడం.. వారి వద్దకే వెళ్లి పరామర్శించడం.. సెల్ఫీలు తీసుకోవడం.. వివిధ అంశాలపై వారికి భరోసా కల్పించడం వంటివి కనిపించాయి.
దీంతో “దానికి దీనికి తేడా లేదే!“ అనే చర్చ నెటిజన్ల మధ్య సాగుతోంది. మరోవైపు.. పత్రికల పరంగా కూడా.. నారా లోకేష్ చేస్తున్న ప్రయ త్నం.. గతంలో జగన్ చేసిన ప్రయత్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
గతంలో జగన్ తన పాదయాత్రకు సంబంధించి.. సొంత మీడియాలో ఒక కాలమ్ తన అభిప్రాయం.. డైరీ పేరుతో రాసుకున్నారు. అంటే.. ఆ రోజు తన పాదయాత్రలో ఏం జరిగింది? ఎవరెవరు తన దగ్గరకు వచ్చా రు? వారికి తాను ఏయే అంశాల్లో భరోసా కల్పించారు. ప్రస్తుతం పాదయాత్ర ఎలా సాగింది.. వంటి ఆ రోజు జరిగిన కీలక అంశాలపై డైరీలో పేర్కొనే వారు.
ఇప్పుడు నారా లోకేష్ కూడా డైరీ పేరుతో తన అనుభవాలు రాస్తున్నారు. మొత్తంగా చూస్తే.. లోకేష్ పాదయాత్రకు.. జగన్ పాదయాత్రకు తేడాలేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.