ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి రెడ్డితో శాంతి వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేశాడు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు శాంతి గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చిందని.. అందుకు కారణం విజయసాయి రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డిలే అని మదన్ మోహన్ చెప్పుకొచ్చాడు.
ఆ బిడ్డకు తక్షణమే డీఎన్ఏ పరీక్ష చేసి.. విజయసాయిరెడ్డి, సుభాష్రెడ్డిలో ఎవరు లీగల్ ఫాదరో తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అటు శాంతి, ఇటు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చిన తమ వెర్షన్ వినిపించడం కూడా జరిగింది. ఇంతలోనే మదన్ మోహన్ మరో బాంబ్ పేల్చాడు. 2022 విజయవాడలో రూ. 2.6 కోట్ల విలువైన విల్లాను కొనుగోలు చేసేందుకు విజయసాయి రెడ్డి ఆర్థిక సహాయం చేశాడని.. రూ. 1.60 కోట్లు క్యాష్ రూపంలో ఇచ్చాడని వెల్లడించారు. దీంతో విజయసాయి రెడ్డి, శాంతి మరింత ముదిరింది.
ఇదే తరుణంలో విజయసాయి రెడ్డి తన ఎక్స్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. ఒట్టు.. శాంతితో నాకు కూతురు లాంటిదంటూ ఆయన వివరణ ఇచ్చారు. `అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్ గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్ లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను.
ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో కూడా చెప్తాను` అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు డీఎన్ఏ టెస్ట్ చేస్తే ఇన్నిసార్లు సంజాయిషీ ఇచ్చుకునే పని ఉండదంటూ సెటైరికల్‌గా కామెంట్స్ పెడుతున్నారు.