రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల తీవ్ర వివాదాలకు కేరాఫ్ గా మారిన పల్నాడు జిల్లాలోని మాచర్ల లో పర్యటించేం దుకు టీడీపీ అధిష్టానం.. స్థానిక నేతలకు పిలుపు నిచ్చింది. దీంతో టీడీపీ సీనియర్ నేతలు “చలో మాచ ర్ల“కు బయలు దేరారు. ఇంకేముంది.. పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మాచర్ల పట్టణంలోని ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ శివారు ప్రాంతాల్లో రాయవరం, కొత్తపల్లి కూడళ్లలో వాహనాలను తనిఖీలు చేపట్టారు.
*టీడీపీ నేతలు అరెస్ట్*
చలో మాచర్ల కు వెళ్తున్న టీడీపీ నాయకులను దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్ లో దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్ల ఘటన గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టి అధిష్టానం చలో మాచర్ల పిలుపు ఇవ్వడంతో, నేడు మాచర్ల బయల్దేరిన నాయకులను pic.twitter.com/3wf77K5tnp
— మాలతి రెడ్డి tdp (@malati_reddi) December 23, 2022
టీడీపీ నేతలు పట్టణంలోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించారు. ఇక, ఇదే జిల్లాకు చెందిన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.. అనంతరం కార్యకర్తలు సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అదేవిధంగా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద టీడీపీ సీనియర్ నేతలు బీవీ ఆంజనేయులు, ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మలపాటి శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వెళ్తుండగా హైవేపై కారును అడ్డగించారు. అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మాచర్లలో 144 సెక్షన్ అమల్లో ఉందని అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల ఘటనపై బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకుని నగరం పాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
@APPOLICE100 అడ్డం పెట్టుకొని మా నాయకులని నువ్వు నిర్భంధం చేయాలనుకుంటే మా కార్యకర్తల ఆగ్రహ, ఆవేశాలకు గురికాక తప్పదు @ysjagan రెడ్డి…. ఖబర్దార్ జాగ్రత్త
మాచర్ల వెళ్లకుండా ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారి ఇళ్లు చుట్టుముట్టిన పోలీసులని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు pic.twitter.com/m83RpntMa2
— 𝐘𝐚𝐬𝐡 𝐁𝐨𝐝𝐝𝐮𝐥𝐮𝐫𝐢 (@iThinkYash_) December 23, 2022