టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించిన నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పై విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, ప్రపంచవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ నెల 8వ తేదీన చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
మరోవైపు, ఈ నెల 10వ తారీఖున ఏపీ హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను లాయర్లతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు కేసులకు సంబంధించి చర్చించనున్నారు. సీనియర్ అడ్వకేట్లు సిద్ధార్థ లూథ్రా, సాల్వే తదితరులతో లోకేష్ భేటీ కానున్నారు.