ఈ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గ సహచరులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు, తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్యను 100 కు పెంచేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సీఆర్డీఏ పరిధిలో రూ.2,700 కోట్ల విలువూన పనులు చేపట్టేందుకు కేబినెట్ ఆమోదించింది.ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై మంత్రులు చర్చించారు. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరిగింది.