KCR జాతీయ పార్టీ పెడతున్నాడు.
OK మంచిదే.
షరతులు వర్తిస్తాయి :
కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు ఉండకూడదు…
ఇంకా మంచిదే….
మరి ఇంక ఎవరితో పొత్తులు…
(1) కేరళ లో, వామ పక్షాలు,కాంగ్రెస్ పొత్తుల లో వున్నారు. సో కెసిఆర్ కి కేరళ లో మద్దతు దొరకదు. ఒకవేళ వామ పక్షాలు కాంగ్రెస్ నుండి విడిపోయినా , రాహుల్ గాంధీ పాదయాత్ర ఫలితం గా పెరిగిన కాంగ్రెస్ బలం, వామపక్షాలు కాంగ్రెస్ కు బై చెబితే కేరళ ఓటర్లు వామ పక్షాలకు బై చెబుతారు.
వామ పక్షాలు కాంగ్రెస్ నుంచి దూరంగా జరిగి కెసిఆర్ కి మద్దతు ఇచ్చేంత అమాయకులు కారు.
So Kerala is ruled out…
(2) ఇహ తమిళనాడు, పాండిచ్చేరి-స్టాలిన్ చాలా క్లియర్ గా చెప్పాడు, కాంగ్రెస్ తోనే పొత్తు ఉంటుందని. ఒక వేళ DMK కాంగ్రెస్ నీ వదిలితే, స్టాలిన్ నో లేదా ఆయన సిస్టర్ కలిమొని నో PM చేస్తాడా.
AIDMK ఎలాగూ BJP తొత్తు
(3).ఇహ కర్ణాటక-అక్కడ బీజేపీ, కాంగ్రెస్ బలంగా వున్నాయి. దేవెగౌడ ఆయన కొడుకు తో పొత్తు అంటే, కొరివితో తల గోక్కున్నట్టు. ఒకవేళ కుమారస్వామి కేసీఆర్ తో పొత్తు ఒప్పుకుంటే వారికి PM పదవి ఇస్తారా.
(4).ఇహ ఆంధ్ర ప్రదేశ్..
ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా కెసిఆర్ ఆంధ్రలో కాలు పెట్టడం అసాధ్యం.
ఆంధ్రులకు బీజేపీ మీద కాంగ్రెస్ మీద కలిపితే ఎంత అసహ్యం ఉందో అంత అసహ్యం ఒక్క కేసీఆర్ మీద వుంది.
So, టీడీపీ కెసిఆర్ తో కలిసే పని లేదు. టీడీపీ ప్రస్తుతం బీజేపీ తో కలవక పోయినా విరోధం పెట్టుకోదు, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా.ఇది కాలం నేర్పిన పాఠం టీడీపీకి.
Next వైసీపీ తో పొత్తు…
జగన్ బతుకు పూర్తిగా బీజేపీ చేతిలో వుంది. ఒక వేల కేసీఆర్ తో పొత్తు పెట్టుకోక పోతే, జగన్ కి హైదరాబాద్ లో ఆస్తులే పోతాయి. కనీసం బెంగళూరు, వైజాగ్ ఇతర దేశ విదేశాల్లో ఉన్న ఆస్తులన్నా మిగులుతాయి.
బీజేపీతో ఉంటే కనీసం బతికి సూట్లు కాకపోయినా గోచి అయిన పెట్టుకోవచ్చు.
So జగన్ కెసిఆర్ కి మద్దతు ఇవ్వడు. మహా అయితే ఆర్థికంగా దొంగచాటుగా సాయం చేయొచ్చు,
2019 లో కెసిఆర్ తనకు చేసిన ఆర్థిక సహాయం గుర్తుంచుకుని.
కానీ జగన్ కి మతి మరుపు కృతఘ్నత ఎక్కువ. ఆయనకు ఇటువంటి విషయాలు తెలియవు.
పైగా ఆయన బతుకే పులివెందుల తడికెల BUS స్టాండ్ అయ్యేట్టు వుంది.
ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ఒంటరిగానే ఆంధ్రలో పోటీ చేయాలి.
మహా అయితే ఆంధ్రాలో ఉన్న 0.0001% వున్న వెలమ ఓట్లు, భీమవరం లోని కేటీఆర్ అత్తగారి ఓట్లు తలసాని యాదవ్ ను పంపించి కొన్ని యాదవుల ఓట్లు సంపాదించుకునే అవకాశం.
మొత్తం ఈ ఓట్లు అన్నీ కలిపితే నాలుగు సంఖ్యకు చేరొచ్చు.
(5). తన స్వంత రాష్ట్రం తెలంగాణ లో, వున్నవే మొత్తం 19 MP సీట్స్, మహా గెలిస్తే ఆరేడు గెలవొచ్చు, తరువాత వాళ్ళు బీజేపీ లోకి Jump అవుతారో లేదో తెలీదు.
(6) ఇహ బీహార్-అక్కడ లాలూ ప్రసాద్ గాంగ్, నితీష్ కుమార్ గాంగ్ సార్ నీ గ్యారెంటీగా PM అవనీరు. కెసిఆర్ పూర్వం బీహార్ నుంచి వచ్చినా, నితీష్ మటుకు మీది బిహారే నాది బిహార్
అని సాంగ్ సింగడు.
(7) ఇంకా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో, కెసిఆర్ ఎవరో ఎవరికీ తెలీదు. కేజ్రీవాల్ కేసీఆర్ తో కలవడు.
రాజస్థాన్ ఇంపాజిబుల్.
బెంగాల్ లో దీదీ డోక్క చించి డోలు వాయిస్టుంది PM తాను కాకపోతే, అసలే కంచు దీదీ..
Eastern States పల్లీ మీద పొట్టు లా చూస్తాయి, కేసీఆర్ నీ.
Final గా కాంగ్రెస్ తో పొత్తు-సోనియా ఎదురుచూస్తోంది, కెసిఆర్ ఎప్పుడు దొరుకుతాడా అని, దొరికాడా ఇంకా పైకి లేవడం జరగదు.
లాస్ట్ ఛాన్స్–బీజేపీ తో పొత్తు–హా…హా…హా……
అన్నింటి కంటే ముఖ్యం: ఉత్తర భారతీయులు సౌత్ లీడర్ నీ PM గా ఒప్పుకోరు. చాణుక్యుడు PV కాబట్టి ఒక పూర్తి టర్మ్ చేశారు. ఎప్పటికీ KCR, PV కాలేడు. హిందీ లో సొల్లు వాగుడు వాగడం తెలుసు కాబట్టి, భారత్ దేశాన్ని ఎల్లేద్దామంటే నై చల్తా….
కాబట్టి కెసిఆర్ గారూ…
హే భాయ్ జర దేఖ్కే చలో ,
ఆగె భీ,
పీచే భీ,
ఉపర్ భీ
నీచే భీ..
ఓ…భాయ్..
.