తోటి తెలుగు వాడిపై నిత్యం పడి ఏడ్చే కేసీఆర్
తోటి తెలుగువాడి నీళ్లు కూడా నాకే కావాలి అని ఏడ్చే కేసీఆర్
తోటి తెలుగు వాడి కరెంటు బకాయిలు ఇవ్వకుండా ఏడ్చే కేసీఆర్
జాతీయపార్టీ పెట్టిన జాతిని ఉద్దరిస్తాడట.
తెలంగాణ కోసమే నా ఊపిరి అన్న ఈయన… తెలంగాణ ద్రోహితో, తెలంగాణ విభజనే తప్పు అని సుప్రీంకోర్టులో కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో పెద్ద మీటింగేశాడు.
ఇంతకాలం శత్రువు అయిన కేసీఆర్ ఉండవల్లి కళ్లకు ఇపుడు గొప్పోడైపోయాడు.
కేసీఆర్ కి ఉన్న దూర దృష్టి, దగ్గర దృష్టి, రాజకీయ దృష్టి ఎవరికీ లేదంటూ ఏదేదో పొగుడుతున్నాడు.
రాజుకు నచ్చింది రంభ, ఉండవల్లి కి నచ్చినోడు నాయకుడు.
తీరా చూస్తే…
ఏపీకి నీళ్లే ఇవ్వని కేసీఆర్ ఇపుడు ఏపీ ఓట్లను ఏమని చెప్పడి అడుగుతాడో మరి? ఆంధ్రులు సిగ్గులేకుండా ఆయన వెంటపడతారా? లేదా ? అన్నది చూడాలి.
ఇక్కడో విషయం ఉందండోయ్.. సొంత రాష్ట్రంలో, తాను సాధించిన తెలంగాణలో తనంతట తాను గెలవలేను అని పీకేని అద్దెకు తెచ్చుకున్న కేసీఆర్, దేశాన్ని ఎలా గెలుస్తాడంటారు? మీరే చెప్పండి బాసూ.