శ్రీరాముడిని దూషించిన వివాదాస్పద సినీ రాజకీయ విమర్శకుడు, జూన్ 26 న నెల్లూరు హైవేపై రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్ కన్నుమూశారు. సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించడంతో ఆయన ప్రమాదానికి గురయ్యారు.
ప్రమాదంలో తలకు గాయాలయ్యాయి. అనేక ఆపరేషన్లు చేసినా ఫలితం దక్కలేదు. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం కత్తి మహేష్ కన్నుమూశారు.
సినిమా క్రిటిక్ గా ప్రయాణం ప్రారంభించిన కత్తి మహేష్ నటుడుగా కూడా మారాడు. అనంతరం చాలా వివాదాస్పద వ్యక్తిగా పేరుగాంచాడు. సినీ తారలతో పాటు రాజకీయాలపై వివాదాస్పద విమర్శలకు ప్రాచుర్యం పొందాడు.
మహేష్ హిందూ దేవతలను దూషించడాన్ని మెజారిటీ ప్రజలు తప్పుపట్టారు. దీని వల్ల అనతు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణకు గురయ్యారు.
గతంలో అతను బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. పవన్ పై తీవ్ర విమర్శలు చేసిన కత్తి మహేష్ తర్వాత వైసీపీ నేతలతో కలిసి తిరగడం, జగన్ ని బలపరచడం చేశాడు. పవన్ ఇమేజ్ ను తీవ్రంగా డ్యామేజ్ చేసి వైసీపీకి మేలు చేసినందుకు సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి 17 లక్షల రూపాయలు అందజేశారని జనసేన కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా అతను మరణించడం సామాజిక మాధ్యమాల్లో ఇపుడు వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ తో వెలుగులోకి వచ్చిన మహేష్ !
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేష్ పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత మహేష్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేష్…రాజకీయాలపై కూడా విమర్శలు, విశ్లేషణలు చేసేవారు. నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను మహేష్ డైరెక్ట్ చేశారు. హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి సినిమాలలో నటుడిగా అలరించారు. ఫిల్మ్ క్రిటిక్ గా పలు సినిమాలపై విమర్శనాత్మక విశ్లేషణలు చేశారు.