ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అత్యంత విషాదాన్ని కలిగించిన ఆ పరిణామం గతంలో కర్ణాటక రాజకీయ వర్గాల్నే కాదు.. దేశ రాజకీయాలను షాక్ కు గురించేసింది. కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు.
చిక్ మంగ్ ళూరు వద్ద రైలుకు ఎదురెల్లి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై ఆయన మృతదేహం వద్దే సూసైడ్ నోట్ లభించడం గమనార్హం. అందులో ఏముందో ఇంకా బయటకు వెల్లడించలేదు. సోమవారం సాయంత్రం ఒంటరిగా కారులో బయలుదేరిన ఆయన ఇలా విగతజీవి అయి పడిఉన్నారు.
ఈయన ఎవరో తెలుసా… ఈ నెల 15న కర్ణాటక శాసన మండలిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలుసు కదా. పలువురు కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ధర్మేగౌడను కుర్చీలో నుంచి లాగేశారు కదా. ఆయనే ఈయన. ఇది ఆయనను తీవ్ర మనస్తాపానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ధర్మేగౌడ ఆత్మహత్యపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత కీలక నేత, భద్రత మధ్య ఉండే వ్యక్తి ఒంటరిగా వెళ్లి ఆత్మహత్య చేసుకునేదాకా పరిస్థితి వెళ్లిందంటే… నమ్మలేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.