ఏపీలో జరగనున్న ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు మహిళలను ఆకట్టుకునేలా టీడీపీ అనేక పథకాలను ప్రకటించింది. గతంలో ప్రకటించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ మేనిఫెస్టోలో భాగంగా మహాశక్తి పథకం పేరుతో మహిళలకు టీడీపీ పలు కీలక హామీలు ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, 18 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతీ నెలా రూ.1500 ఆర్ధిక సాయం వంటి ప్రధాన హామీలు ప్రకటించింది. వీటికి తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ’కలలకు రెక్కలు’ కీలక హామీని ప్రకటించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలలకు రెక్కలు అనే స్కీమ్‌ను నారా భువనేశ్వరి ప్రకటించారు. దీనికి సంబంధించి పోస్టర్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తన ట్విట్టర్లో విడుదల చేశారు. ‘ఇకపై మన ఆడబిడ్డలు ఆర్థిక పరిస్థితి సహకరించక ఇంటి కే పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. ఏపీ యువతుల కలలకు టీడీపీ, జనసేన రెక్కలు ఇవ్వనుంది. విద్యార్థినులు తీసుకు నే రుణానికి ఇకపై మేము గ్యారెంటీ. యువతులు కోర్సు చదవిన కాలానికి అయ్యే ఖర్చుకు పూర్తి వడ్డీ మన ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేస్తున్న ఆడబిడ్డలు పై చదువులు చదువుకునేందుకు తీసుకునే రణాలకు మా ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వమే వడ్డీ భరిస్తుంది` అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇప్పటి నుంచే దరఖాస్తులు
https://kalalakurekkalu.com
నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండలో యువతతో నిర్వహించిన కార్యక్రమంలో 'కలలకు రెక్కలు' పథకాన్ని నారా భువనేశ్వరి గారు ప్రకటించారు. టీడీపీ-జనసేన రూపొందించిన ఈ పథకం ఏపీలోని ఆడబిడ్డల ఉన్నత విద్యా కలలను సాకారం చేయనుంది.
ఇందుకోసం https://t.co/ww1IrBT9n2 వెబ్సైటు… pic.twitter.com/fKZO8NpZ2i
— Telugu Desam Party (@JaiTDP) March 8, 2024