జస్టిస్ నూతలపాటి వెంకటరమణను సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్ 24 వతేదీ నుండి 2022 ఆగస్టు 26 వ తేదీవరకూ కొనసాగుతారు అని రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్నారు.
గత నెలలో ఏప్రిల్ 23 న పదవీ విరమణ చేయబోయే భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే జస్టిస్ రమణను తన వారసుడిగా సిఫారసు చేశారు. 24వ తేదీ రమణ చీఫ్ జస్టిస్ కానున్నారు.
ఆగష్టు 27, 1957 న ఆంధ్రప్రదేశ్ కృష్ణ జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ 2022 ఆగస్టు 26 వరకు అంటే 16 నెలలు దేశ అత్యున్నత న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు.
అతను ఆంధ్రప్రదేశ్ నుండి భారత రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు. ఈ పదవి అలంకరించిన తొలి తెలుగు వాడు జస్టిస్ కె సుబ్బారావు 1966-67 వరకు భారత తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి.
దాదాపు నాలుగు దశాబ్దాల తన కెరీర్లో, జస్టిస్ రమణ “ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, కేంద్ర మరియు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ మరియు సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్, కార్మిక, సేవ మరియు ఎన్నికల విషయాలలో భారత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
సుప్రీంకోర్టు యొక్క అధికారిక వెబ్సైట్లో తన ప్రొఫైల్ ప్రకారం రాజ్యాంగ, క్రిమినల్, సర్వీస్ మరియు ఇంటర్-స్టేట్ రివర్ చట్టాలలో ప్రత్యేకత కలిగి ఉన్నారు.
ఎన్వీ రమణ “జూన్ 27, 2000 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. అతను మార్చి 10, 2013 నుండి మే 20, 2013 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు‘‘
2013 లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2014 లో సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా ఎదిగారు.
జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ను నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని తీర్పునిచ్చిన వ్యక్తి జస్టిస్ ఎన్వీ రమణే. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి వస్తుందని అభిప్రాయపడిన న్యాయమూర్తుల ప్యానెల్లో ఆయన కూడా ఒకరు.