• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ మధ్య గొడవకు కారణం ఇదే..

NA bureau by NA bureau
January 12, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
jogi ramesh

jogi ramesh

0
SHARES
293
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీలో వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం ముదురుతోంది. ఆయన పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేస్తూనే ఉన్నారు. జగన్ పిలిచి వార్నింగ్‌లు ఇచ్చినా ఆయన తగ్గేదేలే అంటున్నారు. ముఖ్యంగా మంత్రి జోగి రమేశ్‌ను లక్ష్యంగా చేసుకుని కృష్ణప్రసాద్ కామెంట్లు చేస్తున్నారు. తన నియోజకవర్గం మైలవరంలో జోగి రమేశ్ అనవసరంగా వేలు పెడుతున్నారన్నది కృష్ణప్రసాద్ ఆరోపణ.

వసంత కృష్ణప్రసాద్‌ది మైలవరం నియోజకవర్గం. జోగి రమేశ్‌ది పెడన నియోజకవర్గం. మైలవరం నియోజకవర్గం తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉంటే పెడన నియోజకవర్గం బంగాళాఖాతం తీరంలో ఉంది. రెండు నియోజకవర్గ కేంద్రాల మధ్య సుమారు 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

ఈ రెండూ పక్కపక్క నియోజకవర్గాలు కాదు. అలాగే… మైలవరానికి సంబంధించిన జోగి రమేశ్‌కు ఎలాంటి బాధ్యతలూ లేవు కూడా. ఇంచార్జి మంత్రిగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు కానీ జోగి రమేశేమీ ఆ బాధ్యతల్లో లేరు. అలాంటిది మైలవరంలో జోగి రమేశ్‌కు ఎందుకంత ఇంట్రెస్ట్ అనేది చాలామందికి అర్థం కాని విషయం.

వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్య వహిస్తున్న మైలవరంలో జోగి రమేశ్ వేలు పెడుతుండడానికి కారణం ఉంది. జోగి రమేశ్ తన కుమారుడు రాజీవ్‌ను ఈసారి అసెంబ్లీ బరిలో దించాలనుకుంటున్నారు. అలా అని రమేశ్ ఏమీ పోటీ నుంచి తప్పుకోవడం లేదు. తాను పెడన నుంచి చేస్తూ కుమారుడిని వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్నది జోగి రమేశ్ ప్లాన్. కానీ.. పెడన చుట్టుపక్కల నియోజవర్గాలేవీ కొడుకు కోసం అంతగా అనుకూలంగా అనిపించలేదట జోగి రమేశ్‌కు.

మైలవరం అయితే తన కుమారుడు రాజీవ్ పోటీ చేయడానికి బాగుంటుందన్నది రమేశ్ అభిప్రాయమని చెప్తున్నారు ఆయన అనుచరులు. మైలవరంలో దేవినేని ఉమాతో గట్టి పోటీ ఉంటుందని తెలిసినా ఆ నియోజకవర్గంలో గౌడ్ ఓటర్ల సంఖ్య ఎక్కువ కావడంతో జోగి రమేశ్ తన కుమారుడు రాజీవ్ గౌడ్ కోసం ఆ నియోజకవర్గాన్ని సెలక్ట్ చేశారు.

రాజీవ్ గౌడ్ కొద్దికాలం కిందట విదేశాల నుంచి ఇండియాకు వచ్చారు. కొద్దినెలలుగా ఆయన మైలవరం నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జోగి రమేశ్‌కు అనుకూలంగా ఉండే మాజీ జడ్పీటీసీ, మరికొందరు నేతలతో కలిసి ఆయన విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ రాజీవ్ గౌడ్, జోగి రమేశ్‌ల ఫొటోలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు మైలవరంలో కనిపిస్తున్నాయి. ఇదీ.. వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ మధ్య గొడవ.

Nandigamaలో YCP భారీర్యాలీ..హాజరైన మంత్రి @JogiRamesh ఏదీ G.O 1 అమలు? ఎక్కడా నీతి వ్యాఖ్యలు వల్లించిన మేధావులు? 👉ఎక్కడా అధికార యంత్రాంగం? అడ్డగింపులు లేవేమీ? 👉చట్టాలు ప్రతిపక్షాలకే పరిమితమా?అధికారపక్షం అతీతులా? @SRKRSajjala @YSRCParty @PawanKalyan @ysjagan @JanaSenaParty pic.twitter.com/7rYnZ3HHT2

— నూకల వెంకట సత్యనారాయణ రావు (@9WEy0152lADO0We) January 6, 2023

Tags: Jogi rameshkrishnanandigamantr districtvasantha krishna prasad
Previous Post

టాలీవుడ్ చరిత్రలో ఎవరికి లేని రికార్డు శ్రుతి కొట్టేసింది

Next Post

వీరసింహారెడ్డి.. వాల్తేరు వీరయ్యలపై … వైసీపీ భారీ కుట్ర ఇదేనా?

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post
veera simha reddy review

వీరసింహారెడ్డి.. వాల్తేరు వీరయ్యలపై ... వైసీపీ భారీ కుట్ర ఇదేనా?

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra