• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టాలీవుడ్ చరిత్రలో ఎవరికి లేని రికార్డు శ్రుతి కొట్టేసింది

శ్రుతి సుడి తిరిగిపోయిందిగా.. ఎవరూ చెరపలేని రికార్డు ఆమె సొంతం

NA bureau by NA bureau
January 12, 2023
in Around The World, Movies, Top Stories, Trending
0
shruthi hassan

shruthi hassan

0
SHARES
269
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక వెలుగు వెలిగిన వారు తర్వాతి కాలంలో పత్తా ఉండరు. అందరు పని అయిపోయిందనుకున్న వేళలో.. ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చేసి అదరగొట్టేస్తుంటారు. తాజాగా అలానే చేశారు అందాల భామ శ్రుతిహాసన్.

ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా.. అగ్ర హీరోలతో జత కట్టిన ఆమెకు.. ఆ తర్వాత అవకాశాలు సన్నగిల్లటం తెలిసిందే. కొంతకాలం ఆమెకు సినిమాలే లేని పరిస్థితి. ఒకవేళ.. అవకాశాలు వచ్చినా అరకొర పాత్రలే తప్పించి.. ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టే క్యారెక్టర్లు రాలేదనే చెప్పాలి.

విశ్వ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీగా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్రను వేయటంలో ఆమె సక్సెస్ అయ్యారు.2000లో వెండితెరకు ఎంట్రీ ఇచ్చినా.. హీరోయిన్ గా వరుస పెట్టి సినిమాలు చేసింది మాత్రం 2011 నుంచి అనే చెప్పాలి. ఆమె కెరీర్ లో గోల్డెన్ డేస్ అంటే 2012 నుంచి 2015 వరకు చెప్పాలి. వివిధ భాషల్లో హీరోయిన్ గా తన సత్తా చాటిన ఆమె.. గడిచిన మూడేళ్లుగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.

తాజాగా సంక్రాంతి సందర్భంగా ఆమె అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. రోజు తేడాతో విడుదల అవుతున్న అగ్రహీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకుంటున్నారు. సంక్రాంతి బరిలో తెలుగులో విడుదలవుతున్న సినిమాల్లో భారీ బజ్ ఇస్తున్న బాలయ్య వీరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య.. ఈ రెండు మూవీల్లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ రోజు (జనవరి 12) వీరసింహారెడ్డి రిలీజ్ అవుతుంటే.. రేపు (జనవరి 13)న చిరు వాల్తేరు వీరయ్య థియేటర్లలో సందడి చేయనుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ అన్న విషయంలో గతంలో ఎవరికి ఇలాంటి అవకాశం లభించలేదని.. అంటున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రెండు మూవీలకు నిర్మాతలు మైత్రి మూవీస్ వారే కావటం విశేషం. అయితే.. ఇలాంటివి శ్రుతి కెరీర్ ను చూస్తే మరికొన్ని కనిపిస్తాయి. ఒకే రోజు విడుదలైన రెండు సినిమాల్లోనూ ఆమె హీరోయిన్ గా ఉన్న రికార్డు కూడా ఆమె సొంతంగా చెప్పాలి.

2013 జులైన 19న ఒకే రోజున ఆమె నటించిన రామయ్యా వస్తావయ్యా, డి-డే రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్ గా రూపొందించినచిత్రం రామయ్యా వస్తావయ్యాగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి హీరోగా గిరీశ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఇక.. రిషి కపూర్.. ఇర్ఫాన్ ఖాన్.. అర్జున్ రాంపాల్ ప్రధానపాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డి-డేలో శుత్రిహసన్ హీరోయిన్ గా నటించారు.

అంతేకాదు.. కరోనా మహమ్మారి తర్వాత విడుదలై టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన రవితేజ క్రాక్ మూవీలోనూ ఆమె నటించారు. ఈ మూవీ జనవరి 9న విడుదల కాగా.. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన హిందీ మూవీ ది పవర్ జనవరి 14న ఓటీటీలో విడుదలైంది. ఇలాంటివి శ్రుతికి మాత్రమే సాధ్యమని చెప్పాలి.

Tags: Balakrishnashruti hassantollywood recordsveera simha reddywaltair veerayyaవాల్తేరు వీరయ్యవీర సింహారెడ్డిశ్రుతిహాసన్సంక్రాంతి
Previous Post

NRI TDP USA-ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహించాలి- జయరాం కోమటి

Next Post

వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ మధ్య గొడవకు కారణం ఇదే..

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post
jogi ramesh

వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్ మధ్య గొడవకు కారణం ఇదే..

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra