జగన్ ప్రభుత్వం ఆశలన్నీ సుప్రింకోర్టు మీదే పెట్టుకుంది. అందుకనే స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. కేసు విచారణను ఎప్పుడు టేకప్ చేసేది తొందరలోనే తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో జగన్ ప్రభుత్వం ఆర్ 5 జోన్‌ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలిచ్చి, పక్కా ఇళ్ళను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. దీనికి అమరావతి జేఏసీ అడ్డుపడింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు దాఖలుచేసింది.
హైకోర్టు జేఏసీ కేసును కొట్టేసింది. దాంతో జేఏసీ సుప్రింకోర్టుకు వెళ్ళింది. కేసును విచారించిన సుప్రింకోర్టు ఇళ్ళపట్టాల పంపిణికి అనుమతిస్తు తుదితీర్పను హైకోర్టే ఇష్తుందని చెప్పింది. దాంతో కేసు మళ్ళీ హైకోర్టుకు చేరుకుంది. అయితే సుప్రింకోర్టు అనుమతించినట్లుగా సుమారు 51 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసేసింది. అంతటితో ఆగకుండా పక్కా ఇళ్ళనిర్మాణాలకు రెడీ అయ్యింది. దాంతో జేఏసీ మళ్ళీ హై కోర్టులో కేసువేసింది.
కేసును విచారించిన హైకోర్టు ఇళ్ళను నిర్మించేందుకు లేదని స్టే ఇచ్చింది. దానిపైనే ప్రభుత్వం సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుచేసింది. పేదలకు నిర్మించబోయే ఇళ్ళు కాబట్టి సుప్రింకోర్టు తన వాదనను సమర్ధిస్తుందని ప్రభుత్వం ఆశతో ఉంది. ఎందుకంటే పేదలకు ఇళ్ళపట్టాల పంపిణీకి అనుమతించిన సుప్రింకోర్టు ఇళ్ళను నిర్మించటంలో ఎందుకు అభ్యంతరాలు చెబుతుందని అనుకుంటోంది. గతంలో ఇళ్ళపట్టాల పంపిణీకి వేసిన పిటీషన్లోనే పట్టాలిచ్చేది పక్కా ఇళ్ళను నిర్మించేందుకే అని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందట.
అయితే సుప్రింకోర్టు ఇళ్ళ నిర్మాణం గురించి ప్రస్తావించకుండా కేవలం పట్టాల పంపిణీకి మాత్రమే స్పష్టంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పాయిట్ మీదే ప్రభుత్వం సుప్రింకోర్టు మీద ఆశలుపెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అందుకనే స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలుచేసింది. మరి కేసు విచారణను ఎప్పుడు టేకప్ చేస్తుంది, ఎప్పుడు విచారణ జరుగుతుంది ? ఎప్పుడు తీర్పిస్తుందో అర్ధంకావటంలేదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేంతలోపే ఇళ్ళని నిర్మించేయాలని ప్రభుత్వం అనుకుంటే ఎక్కడికక్కడ బ్రేకులు పడుతునే ఉంది. మరి సుప్రింకోర్టు ఏమిచేస్తుందో చూడాలి.