అందరూ అనుకున్నట్టే జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యక్తలు, నేతలు.. ఊహించినట్టుగానే జరిగిం ది. ఏపీ ప్రభుత్వం తను అనుకున్నది చేసింది. పవన్ చేపట్టిన రోడ్ల నిరసనపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాష్ట్ర రాజకీయాల్లో దూ కుడు పెంచారు. గడిచిన రెండు రోజులుగా ఆయన ఏపీపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలు.. మంత్రులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఏపీలో పలు అంశాలపై విడతల వారీగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్న పవన్.. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారు లను ఎంచుకున్నారు.
ప్రధాన రహదారులు సహా.. అన్ని రోడ్లు ధ్వంసమయ్యాయని.. నడుములోతు.. గోతులు పడ్డా.. ఎవరూ పట్టిం చుకోవడం లేదని.. ప్రభుత్వం ఒకవైపు పెట్రోల్ చార్జీలను పెంచి.. రహదారుల సెస్సు రూపంలో ప్రతి లీట రు పెట్రల్, డీజిల్పై వసూలు చేస్తున్నా.. ఆ నిధులను రోడ్లకు వెచ్చించడం.. లేదని పవన్ ఇటీవల ఆరో పించారు.
ఇప్పుడు ఇదే అంశాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులపై నిరసన వ్యక్తం చేసేం దుకు పిలుపునిచ్చారు. అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని.. అహింసాయుత మర్గంలో.. నిరస న వ్యక్తం చేసేందుకు తను కూడా స్వయంగా ఏపీకి వచ్చి.. ఇక్కడ మకాం వేశారు.
ఇక, పవన్ పాల్గొనేందుకు.. రాజమండ్రి రైల్, కమ్ రోడ్ బ్రిడ్జిని, అనంతపురంలోని రహదారిని ఎంపిక చేశారు. ఇక్కడ దెబ్బతిన్న రోడ్లకు పార్టీ నిధులతో మెటీరియల్ కొనుగోలు చేసి.. స్వయంగా శ్రమ దానం చేసి.. మరమ్మతులు చేయడం ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనేది పవన్ వ్యూహం. దీనిపై ఇప్పటికే పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శనివారం నాటి కార్యక్రమానికి పక్కా వ్యూహం సిద్దం చేసుకున్నారు.
అయితే.. రాజమండ్రిలో పవన్ పాల్గొనబోయే కార్యక్రమానికి అక్కడి ఆర్ అండ్ బీ అధికారులు, ఇరిగేషన్(ఈ బ్రిడ్జి గోదావరి నదిపై ఉండడంతో) అధికారులు అనుమతి మంజూరు చేయ లేదు. సదరు బ్రిడ్జి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని.. అంతేకాదు.. ఎలా పడితే.. అలా గుంతల ను పూడ్చితే..బ్రిడ్జికి ప్రమాదమని.. పేర్కొంటూ.. అనుమతులు నిరాకరించారు.
ఇక, అనంతపురంలో పోలీసులు శాంతి భద్రతల పేరుతో పవన్ ఎక్కడైతే నిరసన వ్యక్తం చేయాలని అనుకున్నాడో.. అక్కడ యాక్ట్ 30 విధించారు. అయితే.. పవన్ పర్యటనపై ఆంక్షలు విధిస్తారా? లేదా? అనేది చూడాలి. మొత్తానికి పవన్ నిరసన కార్యక్రమం సెగ పుట్టించేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.