కొన్ని సార్లు జగన్ ను మెచ్చుకోవాల్సిందే. ప్రతిదానికీ వెంటనే స్పందించకుండా… మౌనంతో కొన్ని సమస్యలు ముగించేస్తారు జగన్. ఇతర పార్టీల్లో ఉన్నట్టు జగన్ రెడ్డి వద్ద అసమ్మతులకు ఛాన్సుండదు. ఎందుకంటే జగన్ ను విమర్శిస్తే జగన్ ఏమైనాచేస్తారో లేదో తెలియదు గాని ఆయన అభిమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అందుకే జగన్ పార్టీలో అసమ్మతులు ఎన్నున్నా అవి ఎన్నికల ముందు తప్ప మధ్యలో పెద్దగా బయటపడవు.
కొద్దిరోజులు గన్నవరంలోపెద్ద పంచాయతీ నడుస్తోంది. అక్కడ మూడు వర్గాలున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు వర్గం, దుట్టా నాగేశ్వరరావు వర్గం, టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ వర్గం.
వైసీపీ నేతలు, కార్యకర్తలు వంశీని అస్సలు చేరడం లేదు. వంశీ గ్రూపు రాజకీ యాలు చేస్తారని, ఆయన వల్ల వైసీపీకి ఎలాంటి ప్రయోజనం లేదని. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు త మపై కేసులు పెట్టించారని.. ఇలా అనేక రూపాల్లో వంశీని వ్యతిరేకిస్తున్నారు.
పైగా ఆయన ఉంటే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రాదేమో అని ఇద్దరి బాధ. అందుకే వంశీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా జగన్ విద్యా కానుక కార్యక్రమంలో అందరూ ఒక చోట చేరారు. యార్లగడ్డ వెంకట్రావు, వంశీ వల్లభనేని అక్కడే ఉండగా… అందరి ముందు వారి చేతులు కలిపించారు జగన్. సినిమా సెటిల్ మెంట్ లాగా పైకి నవ్వుతూ వెంకట్రావు బొజ్జ నిమిరి వంశీకి సహకరించమని చెప్పారు. పాపం వారేమో ప్రైవేటు పంచాయతీని ఎక్స్ పెక్ట్ చేస్తే జగన్ చాలా సింపుల్ గా తేల్చేసేటప్పటికి ఇద్దరు మొహాల్లో రక్తపుచుక్క లేదు.
మరి ఈ పంచాయతీ సరిపోతుందా? రేపటి నుంచి వీరు విమర్శలు, ప్రతివిమర్శలు ఆపేస్తారా అన్నది వేచిచూడాలి.