ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడానికి నోటికి వచ్చినట్లు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మొత్తం యు టర్న్ తీసుకున్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో తన మాటను తానే తప్పుతున్నాుడ జగన్.
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఎన్యుమరేషన్ లేకుండా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి అన్నాడు. రైతుకు ఎకరాకు 25-30 వేలు ఖర్చవుతుంది అన్నాడు. ఇపుడు సీఎం కాగా ఎన్యుమరమేషన్ కంపల్సరీ చేశారు. సాయం కేవలం 5 వేలు మాత్రమే చేస్తున్నారు. అంటే ఎంపిక చేసిన వైసీపీ అనుకూల రైతులకు మాత్రం ఆ 5 వేలు కూడా అందేది. మరి ఆనాడు జగన్ సాధ్యాసాధ్యాలు పట్టించుకోకుండా మాట్లాడి ఈరోజు అడ్డంగా బుక్కయిపోయారు. రైతులను ఆదుకోవడానికి 40 వేల కోట్లు అవసరం. కానీ కేవలం 2 వేల కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు ముఖ్యమంత్రి జగన్.
గతంలో ఆయన ఏమన్నారో చూద్దామా?
చంద్రబాబు హయాంలో ఒక్కసారి వరద వచ్చింది అంతే. కానీ జగన్ ఏడాదిన్నర పాలనలో 7 వరదలు వచ్చి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్ని ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ పిల్లికి బిచ్చం వేసినట్టుంది జగన్ ప్రభుత్వం పరిస్థితి.
ఇస్తున్న సాయానికి అవసరమైన నిధులక పొంతనే లేదు. 5 శాతం రైతులకు కూడా జగన్ సర్కారు చేస్తున్న సాయం సరిపోదు.