ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు కాపాడుతూ.. వచ్చారంటూ.. మీడియా సహా ప్రతిప క్షాల నుంచి ఏపీ సీఎం జగన్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అవినాష్‌కు సీబీఐ నోటీసులు ఇవ్వడం.. ఆ వెంటనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం.. ఇక్కడ కేసు విచారణ మందగిస్తుండడంపైనా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.
ఇప్పటి వరకు జరిగిన కీలక పరిణామాలు కూడా ఇవే. ఇప్పటికి 5 సార్లు అవినాష్రెడ్డినిసీబీఐ విచారించింది. అయితే.. ఇన్ని సార్లు విచారించినా.. కూడా.. అరెస్టు చేస్తామని చెప్పినా కూడా.. సీబీఐ ఆయన ఒంటిపై ఈగ వాలనివ్వకుండా వ్యవహరిస్తోంది. దీంతో పత్రికలు.. ప్రతిపక్షాలు చెబుతున్నవి నిజమనే భావన ప్రజల్లో చర్చకుగా మారింది. ఇదిలావుంటే.. కీలకమైన ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడంతో.. జగన్ అలెర్ట్ అయినట్టు సమాచారం.
ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల మాట ఎలా ఉన్నా.. ఈ కేసులో ఇప్పుడుతన చుట్టూ కూడా ఆరోపణలు వస్తుండడంతో సీఎం జగన్ ఇక, తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఓ వర్గం మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనేఅవినాష్ అరెస్టు తప్పదని సీఎం జగన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారని, అందుకే ఆయన బాధ్యతలను సమీప బంధువు, వరుసకు కొడుకు అయ్యే డాక్టర్ అభిషేక్‌రెడ్డికి అప్పగించారని ఒక చర్చ కడపలోనే జరుగుతుండడం గమనార్హం.
ఇక, తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనించిన వారుకూడా జగన్ ఇక, ఈ కేసులో జోక్యం తగ్గించు కుంటారని అంటున్నారు. తనకు సంబంధంలేదన్నట్టుగా వ్యవహరించకపోతే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది కర పరిణామాలు ఎదురవుతున్నాయని.. జగన్ గ్రహిస్తున్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా.. ఇప్పటి వరకు వివేకా కేసులో జరిగింది ఒకటైతే.. ఇక, నుంచి జరగబోయేది మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందని.. అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.