ప్రపంచంలో మరే రెండు దేశాల మధ్య లేని హైటెన్షన్.. భారత్ – పాక్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కు వచ్చేస్తుంది.
ఆట మొదలు కావటానికి ముందే.. మైదానం బయట మొత్తం ఈ మ్యాచ్ గురించే నడుస్తూ ఉంటుంది.
ఇక.. మ్యాచ్ కు టికెట్లు అమ్ముతున్నారంటే చాలు.. టికెట్లను కొనుగోలు చేసేందుకు ఎగబడతారు.
నిమిషాల వ్యవధిలోనే టికెట్లు సేల్ అయిపోతాయి.
ఈ మధ్యనే ముగిసిన ఆసియా కప్ లో భారత్ – పాక్ మధ్య మ్యాచ్ ఒకసారి కాకుండా రెండుసార్లు జరగటం.. రెండో మ్యాచ్ లో గెలుపు మిస్ కావటం తెలిసిందే.
పాకిస్థాన్ తో మ్యాచ్ ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేని పలువురు క్రికెట్ క్రీడాభిమానులు ఆటగాళ్లను తిట్టిపోయటం మామూలే.
సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది తమ ఆవేశాన్ని.. ఆగ్రహాన్ని సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఏకిపారేస్తున్నారు.
ఓపక్క ఈ హడావుడి ఇలా నడుస్తుండగానే.. మరోసారి భారత్ – పాక్ మధ్య మ్యాచ్ జరిగే టైందగ్గరకు వచ్చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2022 లో భాగంగా సూపర్ 12 దశలో అక్టోబరు 23న భారత్ పాకిస్థాన్ లు తలపడనున్నాయి.
దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాల్ని మొదలు పెట్టారు.
మిగిలిన మ్యాచ్ సంగతిని పక్కన పెడితే.. భారత్ – పాక్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్లను నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేయటంతో టికెట్లు అయిపోయాయి.
ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లతో పాటు.. అడిషనల్ స్టాండింగ్రూమ్ టికెట్లు సైతం నిమిషాల వ్యవధిలోనే అమ్ముడు కావటం గమనార్హం.
అంతేకాదు.. ఈ మ్యాచ్ కు సంబంధించిన అడిషనల్ స్టాండింగ్ రూమ్ టికెట్లను సైతం నిమిషాల్లో అమ్ముడయ్యాయి.
టోర్నీకి ముందు అధికారికంగా టికెట్ల రీసేల్ ఉంటుందని.. అప్పుడుకావాలంటే.. అభిమానులు అసలు ధరకు టికెట్లను మార్చుకునే వీలుందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అక్టోబరు 22న జరిగే ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయని చెబుతున్నారు.
ఇలాంటి సీన్ కు భిన్నంగా భారత్ – పాక్ మధ్య మ్యాచ్ కు మాత్రం టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయన్న మాట బయటకు వచ్చిన నిమిషాల్లోనే నో టికెట్స్ అన్న బోర్డు పెట్టేసే పరిస్థితని చెబుతున్నారు.
దాయాదుల మధ్య సమరం అంటే ఆ మాత్రం ఉండకుండా ఉంటుందాం చెప్పండి.