ఏపీ సర్కారుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశాలపై చర్చించాలని నిర్ణయించిన కేంద్రం.. దీనికి సంబందించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.
అంతేకాదు.. ఈ సమావేశంలో చర్చించే అంశాలను కూడా పేర్కొంది. దీనిలో చివరి నుంచి రెండో అంశంగా ప్రత్యేక హోదాను చేర్చింది. దీంతో ఏపీ సర్కారు సహా.. కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పెద్ద ఎత్తున తమదే విజయమని ప్రచారం చేసుకున్నారు. ఇంతలోనే మోడీ సర్కారు షాక్ ఇచ్చింది. సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా నుంచి ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ తాజాగా తొలగించింది.
హోదాను ఉదయం ఎజెండాలో పెట్టి… సాయంత్రం తీసేయగానే ఏపీ ప్రజలు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల ఎక్స్ ప్రెషన్
అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్ జారీ చేసింది. రాజకీయంగా చర్చనీయాంశమైన ప్రత్యేక హోదాను అజెండా నుంచి తొలగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి అయిదు అంశాలకే పరిమితం చేసింది.
తొలుత ప్రత్యేక హోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా తొమ్మిది అంశాలను అజెండాలో పేర్కొన్న కేంద్ర హోంశాఖ.. ఆ తర్వాత ప్రత్యేక హోదాను తొలగించింది. ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనకబడిన జిల్లాలకు నిధుల అంశాలను తొలగిస్తున్నట్లు సర్క్యూలర్ జారీ చేసింది.
కాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రామకృష్ణా రావు ఉన్నారు.
జీవీఎల్ కామంట్ ఇదే!
ఈ సమావేశానికి సంబంధించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ వాసి జీవీఎల్ నరసింహారావు ఆసక్తిగా స్పందించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటుపై చర్చ ఉంటుందని ప్రస్తావించిన తరుణంలో దీనిపై స్పష్టత తీసుకోవడం కోసం కేంద్రంలోని సీనియర్ అధికారులతో మాట్లాడినట్టు తెలిపారు. ప్రత్యేక హోదా అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదన్నారు. ఇది కేవలం అంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశం మాత్రమేనన్నారు.
రెవెన్యూ లోటు కూడా ఏపీకి మాత్రమే సంబంధించిన అంశంమని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలు జాబితాలోకి ఎలా వచ్చాయని వాకబు చేస్తే.. ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కడ విభేదాలు ఉన్నాయో.. అవి పరిష్కరించడానికి మాత్రమే ఏర్పాటైన కమిటీ అని తేలిందని చెప్పారు. ఇందులో ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలపై చర్చకు ఆస్కారం లేదని తెలిసిందన్నారు.
పోరాటం అంటే ఇలా ఉండాలి, మరి పోరాటం చేస్తున్నారా ? pic.twitter.com/9N0iyo2ohN
— Telugu Desam Party (@JaiTDP) February 12, 2022