ఈ అందమైన నవ్వు ఇక లేదు. కోటి కలలతో ప్రేమను నమ్మిన ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. మోసం చేసినోడి సంగతి చూడాలన్న పట్టుదల కంటే.. వేదనతో ప్రాణాలు తీసుకున్న వైనం గుండెలు పిండేసేలా చేస్తోంది.
తాజాగా వెలుగు చూసిన టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది. ప్రేమించాలన్న మాటను ఒప్పుకున్న పాపానికి చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోయింది.
హైదరాబాద్ మహానగరంలోని ఫిలింనగర్ లోని బస్తీలో నివాసం ఉండే 22 ఏళ్ల కావలి అనురాధ ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం కిరణ్ అనే కుర్రాడితో ఆమెకున్న ప్రేమ వ్యవహారమే.
ప్రేమించుకున్నాం.. కలిసి ఉందాం.. తర్వాత పెళ్లి చేసుకుందామన్న మాటకు ఓకే చెప్పిన ఆమె.. ఆరేళ్లుగా అతడితో సహజీవనం చేస్తోంది. ఆరేళ్లు గడిచిపోవటంతో ఏమైందో కానీ.. కిరణ్ మరో యువతితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నప్పటికి.. ఆ విషయాన్ని అనురాధకు చెప్పకుండా దాచి పెట్టాడు.
అనంతరం తెలిసి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైన ఆమె.. రెండు రోజుల క్రితం గదిలో ఫ్యాన్ కు ఊరేసుకొని చనిపోయింది.
రెండురోజులుగా గది నుంచి బయటకు రాకపోవటం.. దుర్వాసన రావటంతో అనుమానం వచ్చి గది తలుపులు తీస్తే.. కుళ్లిపోయిన దేహం ఫ్యాన్ కు నిర్జీవంగా వేలాడుతూ కనిపించింది.
అంతకు ముందు వరకు నవ్వుతూ..స్నేహపూర్వకంగా ఉండే ఆమె సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఆమె ఆత్మహత్యకు కారణమైన కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలాన్ని రేపుతోంది.