నేచురల్ స్టార్ నాని హీరోనే కాదు.. నిర్మాత కూడా. అతను తన వాల్ పోస్టర్ సినిమా బేనర్ మీద తీసిన సినిమాలతో మంచి అభిరుచిని చాటాడు.
తొలి చిత్రం అ!ను మించి హిట్ అతడికి మంచి ఫలితాన్నిచ్చింది.
కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్గానూ మంచి సక్సెస్ సాధించింది.
ఈ సిరీస్‌లో వరుసగా సినిమాలు తీయబోతున్నట్లు శైలేష్-నాని ఇంతకుముందే సంకేతాలు ఇచ్చాడు.
హిట్ మంచి హిట్టవడంతో హిట్-2 రేంజ్ కూడా పెరిగింది.
అందుకు తగ్గట్లే థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్‌ను హీరోగా ఎంచుకున్నారు. దీంతో బడ్జెట్, కథ విస్తృతి కూడా పెరిగింది. అంచనాలు కూడా పెరిగాయి.
ఆ అంచనాలను అందుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుని సినిమాను తీర్చిదిద్దుతున్నారు.
ఐతే ఎట్టకేలకు షూటింగ్ పూర్తి కావచ్చింది. సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు.
డిసెంబరు 2న హిట్-2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని స్వయంగా అడివి శేషే వెల్లడించాడు. ఇందులో శేష్ కృష్ణదేవ్ అలియాస్ కేడీ అనే పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.
అతడి సరసన మీనాక్షి చౌదరి నటించింది. రావు రమేష్, భానుచందర్, పోసాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఈసారి హీరో చేపట్టే కేసు ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందన్నది చూడాలి.
డిసెంబరులో మామూలుగా క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి.
ఆ నెల 2వ తేదీ గత ఏడాది అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ రిలీజైంది.
మరి ఈసారి ఆ డేట్‌కు వస్తున్న హిట్-2 ఎలాంటి విజయాన్నందుకుంటుందో చూడాలి.