దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వ నియంత్రణ ఏపీలో ఉందని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. టికెట్ల రేట్లు తగ్గిస్తూ జగన్ సర్కార్ తెచ్చిన జీవో నంబర్ 35ను టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, దర్శకనిర్మాతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు వ్యతిరేకిస్తున్నా…ప్రభుత్వం
నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం డిసెంబరు 24న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నాని ఆ విషయంపై స్పందించాడు. టికెట్ ధర తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ఏపీ ప్రభుత్వం అవమానించిందని నాని షాకింగ్ కామెంట్లు చేశాడు. 10 మందికి అన్నం పెట్టే థియేటర్ కన్నా…దాని పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది మాట్లాడినా వివాదాస్పదమవుతోందని చెప్పాడు. టికెట్ ధరలు పెంచినా సరే కొని సినిమా చూడగలిగిన సామర్థ్యం ప్రేక్షకులకుందని నాని అభిప్రాయపడ్డాడు. స్కూళ్లలో టూర్కు వెళ్లే సమయంలో నువ్వు ఆ డబ్బు చెల్లించలేవంటే ఆ విద్యార్థిని అవమానించడమేనని అన్నాడు. తన పేరు ముందు ‘నేచురల్ స్టార్’ తీసేద్దామనుకుంటున్నానని షాకింగ్ కామెంట్లు చేశాడు నాని. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం, మంచి సినిమా చూపించడమే తమ లక్ష్యమని, లెక్కలు తర్వాత చూసుకుందామని నాని అన్నాడు